అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐ.ఐ.టి. ప్రవేశపరీక్ష (IIT JEE 2007) నిన్న జరిగింది. ఈ పరీక్ష గురించి ఈరోజు హిందూలో రెండువార్తాకథనాలు ప్రచురించినారు: ఒకటి హైదరాబాదు నుంచి, ఇంకొకటి బెంగుళూరు నుంచి. విచిత్రమేమిటంటే ఈ పరీక్ష సులభంగా ఉందని విద్యార్థులంటున్నట్లుగా హైదరాబాదు విలేకరి, చాలా కష్టంగా ఉందంటున్నట్లుగా బెంగుళూరు విలేకరి రాసినారు. :O
ఏమైనా హైదరాబాదులో సులభమంటున్నారు కాబట్టి ఈసారి కూడా ఐ.ఐ.టి.ల్లో ఆంధ్రా విద్యార్థుల హవా కొనసాగుతుందని ఆశించవచ్చా?
ఈ ప్రవేశపరీక్షలో గతానికి భిన్నంగా ఈసారి అన్నీ ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలే అడిగారట. పైగా ఈసారి పరీక్ష మూడు పేపర్లు కాదు, రెండు పేపర్లే. JEE సులభమైనా, కష్టమైనా ఆ ప్రభావం ఎమ్‌సెట్ మీద పడుతుంది.
ఇంకో విషయమేమిటంటే ఈసారి JEE కి నిరుటికంటే తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. దాంతో కొన్ని పత్రికలు విద్యార్థుల్లో ఐ.ఐ.టి.ల పట్ల మోజు తగ్గిపోయిందని రాసినాయి. అసలు విషయమేమిటంటే ఈసారి ఈ పరీక్ష ఎవరూ రెండుసార్లకు మించి రాయకూడదని నిబంధనలను సవరించినారు. అందువల్ల పూర్తిస్థాయిలో పరీక్షకు తయారైనవాళ్ళే దరఖాస్తు చేసుకున్నారు. దాంతో దరఖాస్తులు సహజంగానే తగ్గిపోయినాయి.
No comments:
Post a Comment