ఫోటో: హిందూ
Showing posts with label ఆవేదన. Show all posts

Thursday, 3 September 2009
Tuesday, 25 August 2009
వెన్నెలకు వన్నెలద్దుతున్నామని మురిసిపోయే మూర్ఖశిఖామణులకు
(టపా మారలేదు. మారింది టైటిలే. :) )
మూడు తరాలుగా ఆబాలగోపాలాన్ని అలరించిన చందమామలో గత కొన్ని నెలలుగా "వినాశకాలే..." అన్న తీరులో చోటు చేసుకున్న పెనుమార్పులపై నేను చందమామ సంపాదకులకు ఒక ఈమెయిలు ఘాటుగా పంపాను. (పాత చందమామలను పునర్ముద్రించమని విడిగా ఇంకొక మెయిలు కూడా పంపాను.) పత్రిక ముఖచిత్రాలుగా వపా బొమ్మలనే చూడబోతున్నామనే వార్త ఆనందాన్ని కలిగించేదే అయినా మిగతా మార్పుల విషయంలో చందమామ ప్రస్తుత యాజమాన్యం వైఖరి తెలియకపోవడం వల్ల తోటి చం.పి.లు కూడా ఈమెయిళ్ళ ద్వారా వారిపై ఒత్తిడి తీసుకురావడానికి వీలుగా నేను పంపిన ఈమెయిలు పాఠ్యాన్ని క్రింద ఇస్తున్నాను. (Update: కప్పగంతు శివరామప్రసాద్ గారు చందమామకు రాసిన లేఖ కూడా చూడండి) దీంట్లో మీకు అవసరమనిపించిన మార్పులు - చేర్పులు చేసి editor@chandamama.com, online@chandamama.com లకు పంపవలసిందిగా కోరుతున్నాను.
----------------------------------------

Changes in Chandamama
Dear Sir/Madam,
I am an ardent reader of Chandamama (Telugu). The recent changes in the layout of language editions of Chandamama can only be conceived by a foolish mind which thinks it can make the moonlight more attractive by adding colours to it. There is no need to make Chandamama more 'popular'. What is needed is dedication to make it stick to its core values. It is not just a magazine for us. It much more: to me it is the cultural ambassador of India.
Here is what I want and don't want in Chandamama:
1. Recently you have been asking whether we want more Contemporary stories: My answer is a big NOOOOOOOOOOO if by Contemporary stories you mean stories set in the contemporary/modern world. I definitely want more stories which are set in the ancient/medieval times.
2. You have also discarded the 25-ఏళ్ళనాటి చందమామ కథ in Telugu. I want one every month without fail.
3. Jataka tales: I want them back in the old form. In stead of wasting the time, space and effort on experiments like this, why don't you just reproduce them in their original form and give bigger illustrations in the regular serials and concentrate on improving the quality of content and translations?
4. No more comic strips, please! These are very irksome in Chandamama. if you can't do anything better, you please continue the tradition. Don't meddle and mess up with it. (You can try giving this kind of stuff in Junior Chandamama).
5. I also want two full-page illustrations in the regular serials.
6. One more suggestion: don't leave blank space on either side of the title of each story. It should be covered with illustration only. That way, we can have slightly bigger illustrations as we had previously. They have shrunk to a large extent in recent times and sometimes appear more like miniature paintings. The 'Send SMS' requests have also eaten into the space meant for the illustrations. Please stop them.
7. The editorial page: I haven't ever seen any journal/magazine without its name/logo in the editorial page. The frame designed by Chitra with swans swimming in the lake was pleasing. It's again a foolish idea to discard it.
8. Illustrations: The illustrations with their edges mutilated look as if they are eaten up by white ants. I want them with clear, straight edges.
9. Footer: The writers' names should be given in the footers only.
10. Ordering of the pages: Please retain the old order with the photo caption contest in the last page, etc.
11. Don't publish commercial advertisements between stories.
12. And last but not the least, The cover page: The cover page should reflect the nature and content of the magazine. Once in a while if you have chosen to publish the full-size illustrations of King Vikram carrying the corpse or the illustrations by Chitra that would have been nice. But a group of small small illustrations don't look beautiful and it is blasphemous, disgusting and an unpardonable crime if you think Chandamama can attract more readers or make its readers happy by showing the pictures of cricketers and film stars.
The only thing I liked in the changes you have introduced is the icons indicating the nature of each article/story.
Monday, 27 July 2009
చేజారిన చందమామ?
ఔను, నిజంగానే! దశాబ్దాలుగా ఆబాలగోపాలాన్నీ అలరిస్తూ వచ్చిన చందమామే, అచ్చ తెలుగుదనానికి ప్రతీకలుగా మనం చెప్పుకునేవాటిలో ముందుండే చందమామే తెలుగువాడి చేతిలోనుంచి జారిపోయి పరాధీన అయిపోయింది. ఈ మార్పు చాపకింది నీరులా జరిగిపోయింది. ఆరేడు నెలలకిందటనుకుంటా పాత చందమామ కథను వెండితెర మీద చూడబోతున్నామన్న వార్త తెలిసి ఆనందంతో గంతులు వేసినప్పుడే చందమామ ప్రధాన సంపాదకుడు, ప్రచురణకర్త ఐన విశ్వం చిన్నప్పటినుంచి పెనవేసుకున్న అనుబంధాన్ని తెంచుకుని బాధాతప్త హృదయంతో చందమామ నుంచి తొలగిపోతున్నట్లు చందమామలో సంపాదకీయానికి అదనంగా ఇంకో పేజీలో రాశారు. అది చదివి నాకు గుండె ఆగిపోయినంత పనైంది. అసలు ఆయన చందమామనుంచి తొలగిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది?
1990లలో చందమామ ప్రచురణ తాత్కాలికంగా ఆగిపోయి, పునఃప్రారంభమైన తర్వాత మోర్గాన్ స్టాన్లీకి చెందిన వినోద్ సేథీ తదితరులు ప్రదర్శించిన "సృజనాత్మక ఔదార్యం" గురించి విశ్వం తరచూ ప్రస్తావించి ప్రశంసించేవారు. ఔదార్యం మాట అటుంచి దాంట్లో సృజనాత్మకత ఏముందో నాకు అప్పట్లో అర్థం కాలేదు. ఇప్పుడర్థమౌతోంది ఆ "సృజనాత్మకత" ఫలితమే చందమామలో వ్యవస్థాపకుల వారసులకు, చందమామను ఇన్నేళ్లూ చందమామగా నిలిపినవారికి చందమామలో స్థానం లేకపోవడం. చందమామ మీద "అంతులేని అభిమానం"తో 60% శాతం పెట్టుబడులతో ముందుకొచ్చిన పెద్దమనుషులు వాటాలు పెంచుకుని, విశ్వం మాటకు విలువ లేకుండా చేసి ఇప్పుడు తరతరాల వారసత్వసంపదను ఇంకెవరో అనామకుల చేతుల్లో పెట్టి చేతులు దులుపుకున్నారు (కాదు సొమ్ముచేసుకున్నారు అనడం సరైనది). చందమామ ప్రస్థానంలో ఇప్పుడు నడుస్తున్నది అతి కీలక ఘట్టం. అసలు చక్రపాణి మరణానంతరం (అప్పటికి ఇరవయేళ్లకు పైగా చందమామలో పేరులేని ఎడిటర్ గా కొ.కు. పనిచేస్తున్నప్పటికీ) అంతకు చాలా కాలం క్రితమే చక్కన్న చందమామ ప్రధాన సంపాదకుడిగా తన వారసుడిగా ఎంపికచేసి ఉంచిన విశ్వం గారు, చందమామ సంపాదకుడిగా, ప్రచురణకర్తగా, ముద్రాపకుడిగా సుదీర్ఘకాలం కొనసాగిన విశ్వం గారు ఇప్పుడు చందమామలో లేరు!
విశ్వం చందమామ నుంచి నిష్క్రమించడంతో చందమామలో మరో శకం ముగిసింది. నా చిన్నప్పుడు చందమామలో అప్పుడప్పుడూ కనిపించే Statement about ownership of CHANDAMAMA(Telugu Rule 8 (Form VI), Newspapers (Central) Rules, 1956 లో చందమామ వాటాదారులుగా ప్రచురణకర్త Shri B. VENKATRAMA REDDY (ఆయనే నాగిరెడ్డి కుమారుడు 'విశ్వం') పేరుకు అదనంగా అన్నీ తెలుగు పేర్లే (నాగిరెడ్డి కుటుంబసభ్యులవే) కనిపించేవి:
Shri B. VENKATRAMA REDDY
Shri B. NARESH REDDY
Shri B. SANJAY REDDY
Shri B. V. SHARATH REDDY
Smt. B. PADMAVATHI
Shri B. N. RAJESH REDDY
Smt. B. VASUNDHARA
Kum. B.L. ARCHANA
Kum. B.L. ARADHANA
అర్చన, ఆరాధన మైనర్లుగా ఉన్నప్పటి నుంచే ఇందులో ఉన్నారు (Minors admitted to the benefits of Partnership).
ఇప్పుడో? సంపాదకీయం పేజీలోనే చక్రపాణి-నాగిరెడ్డి, విశ్వం లాంటి అచ్చ తెలుగు పేర్లకు బదులుగా ఒక అరవపేరును చూడాల్సి రావడం దుస్సహంగా ఉంది. మార్పు అదొక్కటే కాదు. చందమామ చాలా మారింది. విశ్వం చందమామ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత ఒకటి రెండు నెలలు సూర్యోదయాల్లో, చంద్రోదయాల్లో ఎటువంటి మార్పూలేదు. అది అబద్ధమేమో, విశ్వం గారు చందమామను వదిలేసి ఎక్కడికి పోతారు? అనుకుని స్థిమితపడుతున్నంతలో మార్పులు ఒకదాని వెనుకొకటి శరాఘాతాలుగా వచ్చి తగిలాయి.
అసలు చందమామలో జరగరానిదేదో జరుగుతోందని చాన్నాళ్ల కిందటే చందమామ వెబ్సైటు chandamama.org నుంచి chandamama.com కి మారినప్పుడే గ్రహించాల్సింది. వెబ్సైటు చిరునామాలో మారింది టాప్ లెవెల్ డొమెయిను ఒక్కటే కాదు - చందమామను చేజిక్కించుకున్నవారి దృక్కోణమే వాణిజ్యమయమైపోయింది. chandamama.org ఉన్నప్పుడు కథలు, తాజా చందమామ సంచికలు Treasure chest అనే విభాగంలో ఉండేవి. (తర్వాత కొంతకాలానికి ఈనాడు చిన్నపిల్లల పేజీ (హాయ్ బుజ్జీ!)లో కథలను ఒక శీర్షికగా "కథల ఖజానా" అనే పేరు కింద వెయ్యడం మొదలుపెట్టడం కాకతాళీయమని నేను అనుకోను :)!!) chandamama.org లో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు విడివిడిగా చర్చావేదికలు (Fora for parents and teachers) ఉండేవి. పిల్లల పెంపకం, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడం లాంటి విషయాల గురించి చర్చించుకునే అవకాశముండేది. వాటి స్థానంలో ఇప్పుడు షాపింగులు, అడ్వర్టైజుమెంట్లు.
నాకు ఆందోళన కలిగిస్తున్న విషయం ఇంకొకటుంది: పోయిన నెల చందమామలో వికీపీడియా లోని ఒక ఫోటో వేశారు. అది వింత కాకపోవచ్చు. ఐతే వికీపీడియాలోని ఆ ఫోటోను GFDL కింద వాడుకున్నట్లు వివరంగా రాసిన నోట్ దాదాపు ఆ ఫోటో అంత స్థలాన్ని ఆక్రమించింది. ఇక్కడ ఆలోచించవలసిన విషయమేమిటంటే ఇతరుల కాపీహక్కులకు ఇంత ప్రాధాన్యత ఇచ్చినవాళ్ళు తమ కాపీహక్కుల విషయంలో ఇంకెంత కఠినంగా ఉండబోతారో అని! 'వాళ్ల హక్కులు, వాళ్ళిష్టం - పైగా బోలెడు డబ్బు పొసి కొనుక్కున్నారు కదా' అనెయ్యకండి. ఇప్పటివరకూ మీరెప్పుడూ చందమామలో కాపీహక్కుల నోటీసు చూసి ఉండకపోతే ఒకసారి చూడండి - విషయసూచిక పేజీలో అట్టడుగున "The stories, articles, designs contained herein are the exclusive property of the publishers. Copying or adapting them in any manner/medium will be dealt with according to law." అని ఉంటుంది.
ఇప్పుడు ఆలోచించండి: chandamama.org వెబ్సైటు ప్రారంభించిన కొత్తల్లో కోరినవారికి ఈమెయిల్ ద్వారా చక్కటి చందమామ కథలను ఇంగ్లీషులో పంపేవాళ్ళు. అవే కాకుండా మనం ఎక్కడైనా వినగా మనకు బాగా నచ్చిన కథలు కూడా చందమామ కథలే అయి ఉండే అవకాశం చాలా ఎక్కువ. ఆ కథలను ముచ్చటపడి మీరు (నేరకపోయి) మీ బ్లాగుల్లో/సొంత వెబ్సైట్లలో పెట్టుకున్నారనుకోండి. చందమామ యాజమాన్యం మీ నుంచి పరిహారం కోరవచ్చు. ఇప్పటివరకూ మాచిరాజు కామేశ్వరరావు, దాసరి వెంకటరమణ, డా, గంగిశెట్టి శివకుమార్ లాంటి రచయితలు తమ కథాసంపుటాల్లో చందమామ కథలు చేర్చుకున్నారు. ఇకమీదట చందమామ కథల రచయితలు కూడా వాటిని తమ కథాసంపుటాల్లో చేర్చడానికి చందమామ యజమానుల అనుమతి కోరవలసిరావచ్చు. చందమామ యాజమాన్యం అనుమతి నిరాకరించనూవచ్చు. లేదా అనుమతికి ఖరీదు కట్టనూవచ్చు. అందుకే చందమామ నిర్వహణ ఎలాంటివారి చేతుల్లో ఉంది అనేది అతి ముఖ్యమైన అంశం.
కొత్త యాజమాన్యం చందమామలో తీసుకువచ్చిన మార్పులు దాదాపు అన్ని అంశాల్లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి:
ముఖచిత్రాలు: ఏ పత్రికకైనా ముఖచిత్రం ఆ పత్రిక స్వభావాన్ని, లోపలి కంటెంటును ప్రతిబింబించేటట్లుగా ఉంటుంది. చందమామలో ఎన్ని రకాల శీర్షికలున్నా ప్రధానంగా అది భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కథల పత్రిక. కథల పత్రికగా ప్రసిద్ధి పొంది మూడుతరాలపాటు అవిచ్ఛిన్నంగా ఆబాలగోపాలాన్ని అలరించిన చందమామ ఇప్పుడు కాలానుగుణామైన మార్పులంటూ ముఖచిత్రాలుగా వపా బొమ్మలకు బదులు క్రికెటర్లు, సినీతారల బొమ్మలు చూపి అమ్మకాలు పెంచుకోవాలనుకునే హీనస్థితికి దిగజారినందుకు బాధగా ఉంది. చందమామ రాగానే ముఖపత్రం మీద వపా సంతకం కోసం అప్రయత్నంగానే వెదకడం, ఈసారి ఆయన సంతకం అడ్డంగా ఉందా, నిలువుగానా? తెలుగులో ఉందా, ఆంగ్లంలోనా లేక చిత్రలిపిలోనా? అని చూసేవాణ్ణి. ఇప్పుడది గతకాలపు జ్ఞాపకం. "55 సంవత్సరాలుగా చందమామ చదువుతున్నా. ఇప్పుడందులో వస్తున్న మార్పులు హర్షణీయమేనా? అమెరికాలో ఉన్న నా మనవరాలు తెలుగు రాకపోయినా తల్లిచేత చందమామ చదివించుకుంటుంది. ఏప్రిల్ సంచిక ముఖచిత్రం చూసి 'ఇది చందమామ కాదు' అందిట." అంటున్నారు ఒక చందమామ అభిమాని. చంపి లందరి గోడు కూడా అదే.
లోపలి బొమ్మలు: చందమామ కథల్లో బొమ్మలకున్న విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే. అవే బొమ్మలు ఇప్పుడు చుట్టూ చెదలు తినిపోగా మిగిలిన పాత పుస్తకాల్లోని బొమ్మల్లా ఉన్నాయి. దశాబ్దాల కిందట తాను ప్రారంభించిన ఒరవడినే అన్ని పత్రికలూ పాటిస్తూండగా వీళ్ళకు కొత్తగా ఏం పుట్టిందో నాకు అర్థం కావడం లేదు. కథల పేర్లు ఇంతకుముందు చిత్రకారుల చేత రాయించేవారు. ఆ పద్ధతికి (చందమామ ఇండియా లిమిటెడ్ ఏర్పడిన తర్వాత) చాన్నాళ్ల కిందటే మంగళం పాడేశారు. ఇప్పుడు రచనల వరుస కూడా ఎట్లా పడితే అట్లా మార్చి పారేస్తున్నారు. ఏ పేజీలో ఏ శీర్షిక/సీరియల్ ఉందో వెతుక్కోవలసిన అవసరం ఇంతకుముందుండేది కాదు. ఉదాహరణకు బంగారులోయ సీరియల్ పేజీలు బైండు చేసుకోవడనికి పుస్తకం నుంచి విడదీస్తే దాంతోబాటే కృష్ణావతారం సీరియల్ చక్కగా చేతిలోకి వచ్చేసేది. ఇప్పుడైతే పీజీల అమరిక మొత్తం అయోమయం, గందరగోళం అయిపోయింది. ఉదాహరణకు, ఇప్పుడు నాలుగేసి పేజీల బొమ్మల సీరియల్స్ రెండు వస్తున్నాయి. అవైనా ఒకటిగా ఇవ్వొచ్చు కదా? ఆమాత్రం శ్రద్ధ కూడా తీసుకోవడం లేదు. కళ్ళు మూసుకుని గుడ్డిగా ఎక్కడేది పడితే అక్కడ అది వేసేస్తున్నారు. ఆఖరుకు ఫోటో వ్యాఖ్యల పోటీ కోసం కూడా పత్రికంతా వెదుక్కోవలసిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. పైగా ఎప్పుడూ లేని విధంగా కథల మధ్యలో కూడా వాణిజ్య ప్రకటనలు! చక్రపాణైతే ఒక్ఖ పేజీ కూడా తేడా రాకుండా చూసుకునేవారు.
మరో మార్పు: ఇప్పుడు కొత్తగా ప్రతి పేజీలో హెడర్, ఫుటర్ ఇస్తున్నారు. మొదట్లో కథ పేరు బొమ్మలో అంతర్భాగంగా చిత్రకారులే రాసేవారు. ఆ రాయడంలో ఆయా చిత్రకారుల శైలి ప్రతిబింబించేది - ఉదాహరణకు చిత్రా గారు రాసే అక్షరాలు ప్రధానంగా రెండు రకాలుగా ఉండేవి. వాటిని చూడగానే ఇవి చిత్రా గారి అక్షరాలు అని తెలిసే విధంగా. తర్వాత కథ పేరును ప్రింట్ చెయ్యడం మొదలుపెట్టారు. ఇప్పుడు కథ పేరు హెడర్లో ఇస్తుంటే - కొత్తగా ఉంది. కథ మొదటి పేజీలో (అది సింగిల్ పేజీ కథైతే తప్ప) బొమ్మ తప్పనిసరిగా పేజీ పైభాగాన్నే ఉండేది. ఇప్పుడా పద్ధతికీ మంగళం పాడేశారు. ఇక ఫుటర్లోనైతే రచయిత పేరు ఉండవలసినచోట ఎస్సెమ్మెస్ విజ్ఞాపనలు! ఎంత చిరాగ్గా ఉంటుందో చూడండి. ఐతే కొత్త అమరికలో అనుకూలమైన మార్పు - నాకు బాగా నచ్చింది - ఏమిటంటే హెడర్ మొదట్లో ఆ పేజీలోని రచనకు సంబంధించిన ఒక చూడముచ్చటైన ఐకన్ ఉంటోంది.
కంప్యూటర్ గ్రాఫిక్స్: బొమ్మలను అందంగా, ఆకర్షణీయంగా చూపడానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ ను అద్భుతంగా వాడుకోవచ్చు. ఏడెనిమిదేళ్ళ కిందట ఇంగ్లిష్ చందమామలో ఒకానొక బొమ్మలో అద్దిన hues and shades చూసి పరవశించిపోయాను. ఇప్పుడు చందమామలో వస్తున్న బొమ్మలు (శంకర్ వేసినవి తప్ప) నాకు అసలేం నచ్చడం లేదు. ఇంతకు ముందు మాదిరే బొమ్మలు మంచి చిత్రకారుల చేత వేయించి వాటికి రంగులద్దడానికి కంప్యూటర్ ను వాడుకుంటే బాగుంటుంది.
కథలు: చందమామలో సీరియల్ కథలను మినహాయిస్తే మిగిలిన కథలన్నీ ఒక ఎత్తు, తానొక్కటీ ఒక ఎత్తుగా ఉండేది 25-ఏళ్ళనాటి చందమామ కథ. ఇప్పుడదీ ఎత్తేశారు.
ఇలాంటి అవకతవక మార్పుల వల్ల ఇంతకాలం ఆబాలగోపాలాన్ని అలరించిన చందమామ చరిత్రలో కలిసిపోనుందా? అని భయమేస్తోంది. కాలానుగుణంగా మార్పులు అనివార్యమే. కానీ కొన్ని మార్పులను అసలు సహించలేం. మరికొన్ని అనివార్యమైన మార్పులను తట్టుకోవడానికి సమయం పడుతుంది. (హిందూ పత్రిక డిజైన్ మార్చినప్పుడు మొదట చాలా చిరాకనిపించింది. కానీ నిదానంగా దానికి అలవాటు పడ్డాను.) చందమామ రూపంలో చోటుచేసుకున్న మార్పులు నాకు ఇంకా జీర్ణం కాలేదు. టైం పడుతుంది. ఇవి చందమామ కొత్త యాజమాన్యం అంటున్నట్లు రూపంలో మాత్రమే అని కూడా సరిపెట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే చందమామ విశిష్టత రూపంలో, బొమ్మల్లో కూడా ఉంది. ఆ రూపమే మారిపోయాక అది చందమామ ఎలా ఔతుంది? సుజాత గారు అన్నారు - అబ్దుల్ కలామ్ గారికి తెలుగు అర్థం కాదుగా అని. కానీ గతంలో చందమామ చదివినవారెవరినైనా మళ్ళీ ఆ లోకంలోకి తీసుకుపోవడానికి బొమ్మలు చాలు.
ఐతే చందమామ ప్రస్తుత యాజమాన్యం తన చర్యలను సమర్థించుకోజూస్తోంది: SMS పోల్ లో కొత్త తరహా ముఖచిత్రాలు గొప్పగా ఉన్నాయి అని 56%, బాగున్నాయి అని 28%, పాతవే నయం అని 16% అన్నారట! ఐనా ఆశ (hope) చావలేదు. "ఏ పత్రికైనా పాఠకుల కోసమే కాబట్టి వారు హర్షించని మార్పులు పత్రికలో మనగలవనుకోం" అంటున్నారు వసుంధర. చందమామకు గ్రహణం పట్టి చీకట్లు కమ్మిన ప్రస్తుత దశను త్వరలోనే దాటి చల్లని వెన్నెల కురుస్తుందని ఆశిద్దాం.
పూర్తిగా చందమామకు సంబంధించింది కాకపోయినా ఇక్కడ అప్రస్తుతం కాని ఒక చిన్న ప్రశ్న: చక్రపాణి చక్కన్న ఎలా అయ్యాడు?
కొసరు: మీ చిన్నప్పుడు చివరి పేజీలో వస్తూ ఉండిన పార్లే పాపిన్స్ ప్రకటనలు కూడా మీ చందమామ జ్ఞాపకాల్లో ఒక భాగమేనా? ఐతే ఇక్కడ చూడండి.

Monday, 2 February 2009
దేవుని కడపనొక కంట చూడు దేవా!
తిరుమలేశుని తొలిగడపగా ప్రఖ్యాతి పొందిన దేవాలయం దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయం. అంతేకాదు, దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్లడానికీ ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్లడానికీ తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్లడానికీ కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడుచోట్లకూ వెళ్లే భక్తులు కచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సోమేశ్వరస్వామిని దర్శించుకుని అనంతరం మూడు క్షేత్రాలకు వెళ్లేవారు. ఈ కారణంతోనే మూడు పుణ్యక్షేత్రాల తొలి గడపగా దేవునికడపను పేర్కొంటారు. ఇక్కడి దైవం ఏడుకొండల వేంకటేశ్వరునికి ముమ్మూర్తులా ప్రతిబింబంలా కనిపించే శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుడు. తిరుమల శ్రీవారి మాదిరిగానే ఇక్కడ కూడా స్వామివారి వక్షస్థలంపై కుడివైపు మహాలక్ష్మి కొలువై ఉంది.
తిరుమలలోని శ్రీవారి దర్శనార్థం వెళ్ళే భక్తులు ముందు దేవుని కడపలో స్వామివారి దర్శనం చేసుకుని ఆ తర్వాతే తిరుమలకు వెళ్ళడం ఆచారం. రవాణా సౌకర్యాలు ఇప్పుడున్నంతగా అభివృద్ధి చెందని రోజుల్లో భక్తులు తిరుమల మొక్కులు కూడా ఇక్కడే చెల్లించుకునేవారు. ఇక్కడ చెల్లించే మొక్కులు, కానుకలు సాక్షాత్తూ తిరుమలలోని స్వామివారి సన్నిధిలో చెల్లించినట్లుగా స్వామివారు ప్రీతి చెందుతారు. అంతటి ముఖ్యమైన దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకువచ్చినప్పుడు భక్తులంతా ఎంతగానో సంతోషించారు. ఈ దేవస్థానం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని ఆశించారు. ఐతే గత ఆగస్టులో అక్కడికి వెళ్ళిన మేము అక్కడి వాస్తవ పరిస్థితులను, దేవస్థానం వారి నిర్లక్ష్యాన్ని, సాక్షాత్తూ దేవాలయంలో నెలకొన్న దుర్భరమైన అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి దిగ్భ్రాంతి చెందవలసి వచ్చింది. ఇంతటి ప్రాశస్త్యం గల దేవాలయం, అందునా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్న సొంత జిల్లా కేంద్రంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అంతటి దయనీయమైన స్థితిలో ఉన్నందుకు ఆవేదన కలిగింది.
"Cleanliness is next to Godliness" అంటారు. మన సంప్రదాయాలు, మడీ-దడీ-ఆచారాలు కూడా శుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఏర్పాటు చేసుకున్నవే. శుచి-శుభ్రత లేనిచోట దరిద్రం తాండవిస్తుందని మన నమ్మకం. కానీ మేం వెళ్ళినప్పుడు ఇక్కడ అడుగడుగునా అపరిశుభ్రతే కనిపించింది. గర్భగుడి చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేసే అంతరాళంలో గర్భగుడి గోడల వెలువలివైపున, నేల మీద ఎంగిళ్ళు, వక్కాకు చారికలు, బీడీ ముక్కలు, ...అది చూసి తట్టుకోలేక ప్రదక్షిణాలు గబగబా ముగించుకుని ఇవతలికి వచ్చేశాం.
పేరుకు ఇక్కడ ఒక అద్దాల మండపం కూడా ఏర్పాటు చేశారు కానీ దాని అతీ గతీ పట్టించుకునే నాథుడే లేడు. ప్రవేశద్వారం దగ్గర "ప్రవేశరుసుము 2 రూపాయలు" అని ఉంది. కానీ లోపలికి వెళ్ళాలనుకునేవారికి టిక్కెట్లు అమ్మేవాళ్ళుగానీ, టిక్కెట్లను తనిఖీ చెయ్యడానికి గానీ దరిదాపుల్లో ఎవరూ లేరు. చివరికి లోపలికివెళ్ళినవాళ్ళు అద్దాలన్నిటినీ పగలగొట్టి వచ్చినా పట్టించుకునే దిక్కులేదనడానికి ప్రత్యక్ష తార్కాణం అక్కడే మా కళ్ళబడింది. ఆ అద్దాల మండపం ద్వారం దగ్గర పాలరాతితో ఏర్పాటుచేసిన మెట్లను (సోపానాలను) ఎవరో రాళ్లతో తుక్కుతుక్కుగా నలగ్గొట్టిపెట్టారు. మరీ ఒక మెట్టు మీదైతే పాలరాయి ఒకవైపు అడుగు వ్యాసంలో పూర్తిగా పొడిపొడిగా మారిపోయి ఉంది. అక్కడి నుంచి అన్ని వైపులకూ చివరి దాకా నెర్రెలు చీలి ఉన్నాయి. నలగ్గొట్టడానికి వాడిన రాయి కూడా ఫుట్ బాల్ సైజులో ఆ మెట్టుమీదే ఉంది! ఆలయ నిర్వాహకులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలుగుతారసలు?
ఇవన్నీ చూశాక "సీతారామస్వామీ! నువు చేసిన నేరంబేమి" అనిపించకమానదు. ఆ దేవుడే మొరబెట్టుకున్నా మన ఏలినవారి చెవులకెక్కవుగదా? ఇక మన (ఆ)వేదనలు వినిపిస్తాయా? సొంతజిల్లాలో కోట్లు ఖర్చుబెట్టి వారు చేస్తున్న అభివృద్ధి ఫలాలు అస్మదీయులకేనా? అనిపించి అక్కడ లభించే తిరుపతి లడ్డు తిన్న తర్వాత కూడా నోరంతా చేదుగా అనిపించింది.
ఈ ఆలయానికి సంబంధించి కొన్ని విశేషాలు:
- తిరుమల వరాహక్షేత్రం కాగా ఇది హనుమక్షేత్రం. ఆంజనేయస్వామి ఇక్కడి క్షేత్రపాలకుడు.
- ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని మహాభారతంలో కౌరవుల కులగురువైన కృపాచార్యులు ప్రతిష్ఠించారని అంటారు.కాబట్టే ఈ ప్రాంతానికి కృపాపురం అనే పేరు వచ్చిందంటారు. కాలక్రమంలో అది కురుప, కరిపె, కరిగె గా రూపాంతరం చెందిందనీ అదే కడపగా మారి ఉండొచ్చనీ చరిత్రకారుల అంచనా. (క్రీ.శ. రెండవ శతాబ్దంలో టాలెమీ కడపను కరిపె, కరిగె అని పేర్కొన్నాడు. పేరులో కరి అని ఉంది కాబట్టి ఇక్కడ ఆ కాలంలో ఏనుగులు ఎక్కువగా ఉండేవంటారు.)
- ఐతే ఇక్కడ అంతకుముందునుంచే ఆంజనేయస్వామి క్షేత్రం, హనుమత్ పుష్కరిణి ఉండేవని, స్వామివారి స్వప్నసందేశాన్ననుసరించి స్వామివారిని ప్రతిష్ఠింపజేయడానికి ఈ స్థలం అనువైనదిగా నిర్ణయించినది జనమేజయ మహారాజు అని, శ్రీవారి విగ్రహానికి వెనుక వైపున గోడలో ఆంజనేయుడి ప్రతిమ రాతిలో కనిపిస్తుందని "మనకు తెలియని కడప" గ్రంథంలో శశిశ్రీ రాశారు.
- ఆలయ ప్రాంగణంలో ఆండాళమ్మ, విష్వక్సేన, పద్మావతి అమ్మవారు, శంకచక్ర ధ్వజగరుడ అళ్వారు, హన్మత్‌పెరుమాళ్లు, నృత్యగణపతి... తదితర దేవీదేవతలు కొలువై ఉన్నారు.
- దేవుని కడప ఆలయ కోనేటిని హరిహర సరోవరమని, హనుమత్ పుష్కరిణి అని పిలుస్తారు. కొలనులో నిరయ మంటపం, తీర్థవాశి మంటపం ఉన్నాయి. పాతకడప చెరువు నుంచి ఇక్కడికి నీటి మార్గం ఉంది. పుష్కరిణిలో స్వామి తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.
- ఏటా ధనుర్మాసంలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ఇక ప్రతి ఏడాదీ మాఘశుద్ధ పాడ్యమి(ఈ ఏడాది జనవరి 27) నుంచి ఏడురోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అన్ని మతాలకు చెందిన భక్తులు పాల్గొంటారు.
- మరో విశేషమేమిటంటే ఈ ఆలయ ఆవరణలో ఉన్న వినాయకుడికి నిలువునామాలుంటాయి.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే గాక కేంద్ర ప్రభుత్వం కూడా కడపజిల్లాలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించగల ఇంత గొప్ప పుణ్యక్షేత్రంలో ఆలయప్రాంగణం ఎల్లవేళలా శుభ్రంగా ఉంచడం నిర్వాహకుల కనీస ధర్మం.
-శ్రీదేవి & త్రివిక్రమ్
ఈరోజు దేవుని కడప బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం జరుగుతుంది. ఏటా రథసప్తమి నాడు జరిగే రథోత్సవం, కల్యాణోత్సవం, గరుడవాహన సేవలో పాల్గొనడానికి భక్తులు వేలాదిగా తరలివస్తారు. దేవుని కడప రథోత్సవం గురించి
"కన్నుల పండుగ లాయే కడప రాయని తేరు
మిన్ను నేల శృంగారము మితిమీరినట్లు" అన్నాడు అన్నమయ్య.
Thursday, 27 March 2008
దుంగల దొంగలకు చందన చర్చ?
కడప జిల్లాలో సిద్ధవటం రేంజిలోని లంకమల అడవులు, పరిసరప్రాంతాల్లో ప్రపంచంలో మరెక్కడా దొరకని అరుదైన ఎర్రచందనం దొరుకుతుంది. (ఇది ప్రధానంగా కడప జిల్లాలోను, జిల్లా సరిహద్దుకవతల నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోను దొరుకుతుంది.) గతవారం నాకు పరిచయమైన ఒక సి.బి.సి.ఐ.డి. అధికారి దగ్గర మాటల సందర్భంలో దీనిగురించి ప్రస్తావిస్తే ఆయన "లంకమల అడవుల్లో గతంలో ఎర్రచందనం చెట్లు ఉండేవి. ఇప్పుడు అవి దాదాపుగా అంతరించిపోయాయి." అని విచారంగా అన్నారు. ఏమయ్యాయి? అని అడగనవసరం లేదు. దుంగల రూపంలో అక్రమంగా సరిహద్దులు దాటాయి. విదేశాల్లో ఎర్రచందనానికి విపరీతమైన గిరాకీ ఉండడం వల్ల గడచిన దశాబ్దకాలంలో ఎర్రచందనం అక్రమ రవాణా విపరీతంగా పెరిగిపోయింది.
కరువు ప్రాంతమైన కడప జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు సాపేక్షంగా తక్కువే అని చెప్పాలి. కుటుంబాలను పోషించడానికి పొట్ట చేతబట్టుకుని కువైట్ తదితర గల్ఫ్ దేశాలకు వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఎక్కువ. అంతదూరం వెళ్లలేని వాళ్లలో కొందరికైనా విపరీతమైన గిరాకీ ఉండే ఎర్రచందనం అక్రమరవాణాకు సహకరించడం మన ప్రజారాజ్యంలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశంగా కనిపించడంలో వింతేమీ లేదు. ఐతే గత్యంతరం లేనివాళ్ళే అక్రమరవాణాకు పాల్పడుతున్నారనుకోవడం అమాయకత్వం. స్థానికంగానూ, పొరుగు జిల్లాల్లోనూ రకరకాల వృత్తులు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఇందులో ఉన్నారు. పోలీసుల దాడిలో చిక్కినవారిలో జిల్లాలోని ఒక నగర కౌన్సిలర్, ఒక న్యాయవాది ఉన్నారు. ఒక్కోసారి దాడుల్లో దుంగలతో నిండిన వాహనాలు మాత్రమే పట్టుబడి, స్మగ్లర్లు, వాహనసిబ్బంది తప్పించుకు పారిపోవడంలోని లోగుట్టు అందరికీ ఎరుకే. గత సంవత్సరం సాక్షాత్తూ కడప నగర మేయర్, ముఖ్యమంత్రి బావమరిది ఐన రవీంద్రనాథ రెడ్డి సొంత వాహనాల్లోనే ఈ ఎర్రచందనం దుంగలు అక్రమంగా రవాణా అవుతూ పట్టుబడడం ఎవరూ మరచిపోలేదు.
సిద్ధవటం రేంజిలోని లంకమల్ల అభయారణ్యం (కలివికోడి కోసం ఏర్పడిన శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం) లో ఎర్రచందనం వృక్షాలు విస్తారంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా రోలబోడు, కొండూరు, మద్దూరు, పొన్నాపల్లి బీటులో ఎర్రచందనం దుంగలు అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఖాజీపేట, మైదుకూరు, బ్రహ్మంగారిమఠం మండలాల్లోని బోగాదిపల్లె, వెంకటాపురం, భాగ్యనగరం, నాగసానిపల్లె, తూపల్లి, జాండ్లవరం గ్రామాలకు చెందిన కూలీలు లంకమల్లలోని రోలబోడు, బాలయ్యపల్లె బీటులో చందనం వృక్షాలను నరికి దుంగలను విక్రయిస్తారు. కూలీల నుంచి దుంగలను కొనుగోలు చేసిన జాండ్లవరం, జి.వి.సత్రం, ప్రొద్దుటూరులకు చెందిన బడా స్మగ్లర్లు వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఇది ఒకరకం స్మగ్లింగ్ కాగా కూలీల చేత చెట్లు నరికించి దుంగలను అడవిలోనుంచే నేరుగా వాహనాల్లో తరలించడం మామూలుగా జరుగుతుంటుంది. ఈ వాహనాల రాకపోకల కోసమైతేనేమి, కూలీలకు రాత్రిపూట అడవిజంతువుల నుంచి రక్షణ కోసమైతేనేమి అడవికి అగ్గిపెట్టడం, పనయ్యాక ఆ మంటలను ఆర్పకపోవడం వల్ల అడవంటుకోవడం ఇంకో విషాదం.
ఈ స్మగ్లర్ల వెనుక పెద్ద పెద్ద ముఠాలే ఉన్నాయి. జిల్లాలో ఎర్రచందనాన్ని అక్రమరవాణా చేసే ముఠాలు కనీసం 8 ఉన్నాయని పోలీసులే ప్రకటించారు. అలాంటి ముఠాలలో రెడ్డి నారాయణ ముఠాకు సహకరిస్తున్నందుకు గత అక్టోబరులో ఏకంగా 17 మంది అటవీ అధికారులను, 21 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ చర్య అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకేసారి ఇంతమంది అధికారుల సస్పెన్షన్ కు సిఫార్సు చేస్తూ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న జిల్లా ఎస్పీ వై. నాగిరెడ్డి జిల్లాలో ఉమేష్ చంద్ర తర్వాత గొప్ప ఎస్పీగా నీరాజనాలు అందుకున్నారు. (పదేళ్ల కిందట దేశంలోనే అత్యంత సమస్యాత్మక జిల్లాల్లో రెండోస్థానంలో ఉన్న కడప జిల్లాలో ఫ్యాక్షనిజాన్ని అరికట్టి జిల్లాలో శాంతిభద్రతలు నెలకొల్పిన రియల్ హీరో ఉమేష్ చంద్ర.) మిగతా ముఠాలను, వారికి సహకరిస్తున్న పోలీసు, అటవీ అధికారులను పట్టుకోవడానికి పెద్ద పెద్ద ప్రణాళికలే వేశారు, పెద్ద పెద్ద శపథాలే పలికారు. ఐతే అందుకనుగుణంగా ఆ తర్వాతేమీ జరగలేదు.* ఈ సస్పెన్షన్ కు ముందూ, ఆ తర్వాతా కూడా ప్రతిరోజూ జిల్లా పత్రికల్లో అక్కడ (అక్రమంగా రవాణా అవుతున్న) అన్ని టన్నుల ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు, ఇక్కడ ఇన్ని టన్నుల దుంగలను పట్టుకున్నారు, అని వార్తలు రొటీన్ గా వస్తూనే ఉన్నాయి. ఈ సస్పెన్షన్ విషయంలో నాణానికి రెండోవైపు కూడా ఉంది:
సస్పెండైన అటవీ, పోలీసు ఉద్యోగులు ఇప్పుడు తెగబడి మరింత ఉధృతంగా, బాహాటంగా దుంగల అక్రమ రవాణాకు పాల్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వారికి లంకమల ఆనుపానులు తెలుసు. అడవుల్లో దారులు తెలుసు. ప్రభుత్వ యంత్రాంగం పరిమితులు తెలుసు. దాని చేతగానితనమూ తెలుసు. అక్రమరవాణా చేయడంలో రకరకాల పద్ధతులు తెలుసు. ఏరకంగా అధికారుల కళ్ళుగప్పవచ్చో తెలుసు. ఈ అక్రమ వ్యాపారంలోకి దిగదలచుకున్న వారికి, వారితో చేతులు కలపదలచుకున్నవారికి, బేరసారాలు ఆడదలచుకున్నవారికి ఇప్పుడు పని మరింత సులభమైంది. 'పని' సులభంగా జరగాలంటే నేరుగా ఎవరిని కలవాలో ఇప్పుడు చిన్నపిల్లలక్కూడా తెలుసు. పైగా ఇప్పుడు ఈ 'అధికారులు' హమేషా హాజరీలో ఉంటారు. ఇంతకుముందు మొక్కుబడిగానో, తప్పనిసరయ్యో ఆఫీసులకు వెళ్ళడం, రిపోర్టు చెయ్యడం, 'పనిలోకి దిగేటప్పుడు' ముందూ వెనుకా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమయ్యేవి. ఇప్పుడు అవేవీ అవసరం లేదు కదా? సస్పెండ్ చేసిన రెండువారాలకే సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ అక్రమరవాణా ఇంకా జరుగుతూనే ఉందని, సస్పెండైనవారిలో కొందరు ఫుల్ టైం స్మగ్లర్లుగా మారి సొంత గ్యాంగులు నడిపేలా ఉన్నారని హెచ్చరించారంటే వీళ్ళు అక్రమ రవాణాకు ఎంతగా అలవాటు పడిపోయారో అర్థమౌతుంది. ఐనా కలెక్టర్ వెర్రిగానీ అరకొర చర్యలు తీసుకుంటే ఫలితం అలా కాక ఇంకెలా ఉంటుంది? వాళ్లకు ఆ సస్పెన్షన్ చర్యే ఎండాకాలంలో గంధం పూసినంత హాయిగొలిపి ఉంటుంది. అప్పుడు సస్పెన్షన్ కు సిఫార్సు చేసిన ఎస్పీ నాగిరెడ్డి ఆర్నెల్లు తిరక్కుండానే బదిలీ ఐతే ఇంకెంత హాయిగా ఉంటుంది?
"చందన చర్చిత ..."
-----------------------------------------------------------------------
* ఈ సస్పెన్షన్లైన కొన్నాళ్ళకే హైదరాబాద్ నుంచి వచ్చిన ముగ్గురు సీబీసీఐడీ అధికారుల బృందం మైదుకూరు ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ స్మగ్లరు ఇచ్చిన సమాచారం ఆధారంగా జిల్లాలో రహస్యంగా విచారణ జరిపి వెళ్ళింది. కోడూరు ప్రాంతంలో బడా నాయకులతో, అటవీ శాఖలో కొందరు అవినీతి అధికారులతో సంబంధాలున్న బడా స్మగ్లర్ల వివరాలు సేకరించడంతో పాటు అటవీ చెక్‌పోస్టుల సిబ్బంది వ్యవహారశైలిపై ఆరా తీశారు. ఆయా పోలీసుస్టేషన్లకు చెందిన అధికారుల కేసు డ్యూటీ రిజిస్టర్లను పరిశీలించారు. (విధి నిర్వహణలో భాగంగా పోలీసు అధికారులు ఏ కారణంపై, ఏ ప్రాంతాలకు, ఏ మార్గాల ద్వారా జీపులో వెళ్లారో రిజిస్టరులో నమోదు చేస్తారు.) ఎర్రచందనాన్ని తరలించేముందు స్మగ్లర్లు అనుసరించే వ్యూహాలు, వెళ్లే మార్గాలు, ఏఏ వర్గాల ద్వారా ఎలాంటి సహకారం అందుతోంది తదితర అంశాలను ఆ స్మగ్లరు సీబీసీఐడీ అధికారులకు వెల్లడించాడట. ఎర్రచందనం స్మగ్లర్లకు కొందరు పోలీసులు సహకరించారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేసు డ్యూటీ రిజిస్టరును పరిశీలించడం పోలీసులకు గుబులు పుట్టించింది. కొన్ని చోట్ల ఎర్రచందనం దుంగులను తరలించే వాహనానికి పోలీసులు ముందు వెళుతూ అడ్డంకులు ఎదురుకాకుండా సురక్షితంగా జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వివిధ ప్రాంతాలను సందర్శించే ముసుగులో పోలీసులు స్మగ్లర్లకు సహకరించారా, ఈ వ్యవహారంలో తలదూర్చకుండా తమ విధులు తాము నిర్వహించి వెనుదిరిగారా అనే కోణంలో విచారణ జరిగింది. జిల్లా సరిహద్దుల్లో అటవీ చెక్‌పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇందులో పనిచేసే సిబ్బంది వ్యవహారశైలి, పనితీరు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై కూడా ఆరా తీశారు. తర్వాతేమైంది? Business as usual!

Monday, 25 June 2007
కవితలు రాయడమే నేరమా?
ఈ రాజకీయనాయకుల వాచాలతకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. మొన్న శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, నిన్న ఎ.బి.బర్ధన్.
“The President said he was deeply wounded by the attack on him after he decided to accept our offer to contest. He has been deeply hurt by the statement of those in high positions. The kind of boorish and churlish language that has been used amounts to denigration of the high post of President and does not befit the high positions held by those [Union Ministers] who have used such language.”
వాళ్ళ అతివాగుడుకు రాష్ట్రపతి నొచ్చుకున్నారని తెలిసీ - ఆయన పోటీ చెయ్యబోనని తేల్చి చెప్పిన తర్వాత కూడా - "రాష్ట్రపతి పని కవితలు రాయడం కాదు" అంటూ ఇంకా ఏమేమో వాగుతున్నాడొకాయన. కవితలు రాయడమే కలామ్ గారు చేసిన తప్పన్నట్లు మాట్లాడుతున్నాడీ సిగ్గులేని పెద్ద మనిషి. ఉన్నతపదవుల్లో ఉన్నవారి గురించి ఇంత హేళనగా, దురుసుగా మాట్లాడ్డమేనా ఈ రాజకీయనాయకుల సంస్కారం? వీరిదే మరో అమృతవాక్కు: రాజకీయానుభవం లేనివాళ్ళు రాష్ట్రపతిగా ఉండతగరట! రాజకీయులే నేరం చేసినా....క్షమించాలి, ఈ పుణ్యభూమిలో రాజకీయులేం చేసినా, ఏం వాగినా అది నేరం కాదుకదా? స్వార్థప్రయోజనాల కోసం, మూర్ఖపు పట్టుదలలు నిలుపుకోవడం కోసం ప్రజాభీష్టానికి, ప్రజాశ్రేయస్సుకు వ్యతిరేకంగా పనిచెయ్యడం రాజకీయులకే కదా సాధ్యం?
అసలు రాష్ట్రపతి చేయవలసిన పనేమిటి? రాజకీయులు తీసుకునే నిర్ణయాల్లో దేశప్రజలకు ఏది మేలు చేస్తుందో, ఏది రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా ఉందో, ఏది విఘాతం కలిగిస్తుందో తెలుసుకోవడానికి రాజకీయానుభవం అవసరమా? కలామ్ గారిని వీళ్ళు కేవలం కవితలు రాసేవాడిగానే చూస్తున్నారంటే వీళ్ళ గురించి ఏమనుకోవాలి? లేక...కవితలు రాయడాన్ని వీళ్ళు అనర్హతగా భావిస్తున్నారనుకోవాలా? అసలు ప్రజాస్వామ్యదేశంలో ప్రజల మనోభావాలను తుంగలో తొక్కిన ఈ రాజకీయ నాయకులు ఇలా ఈ దేశపు ప్రథమ పౌరుడు, సర్వసైన్యాధ్యక్షుడిపై ఇలా అవాకులు, చెవాకులు పేలుతున్నా వీళ్ళను అదుపు చేసేవాళ్ళే లేరా? తాము విమర్శిస్తున్నది సాక్షాత్తూ ఈ దేశాధ్యక్షుణ్ణే అనే స్పృహ వీరికేమాత్రమైనా ఉందా? ఈ దేశంలో ఇంకా గౌరవాన్ని నిలుపుకున్న పదవి రాష్ట్రపతి పదవొక్కటే. రాజకీయులు ప్రస్తుతం దాని గౌరవాన్నీ దిగజార్చే పనిలో ఉన్నారు.
అసలు ఈ రాష్ట్రపతి, ఉపరాష్ట్రతి పదవులకు సంబంధించి ఏది సంప్రదాయం, ఏది కాదు అనేవిషయం గురించి కూడా అధికారంలో ఉన్నవాళ్ళు తమ వాదనకు ఏది అనుకూలంగా ఉంటే దానికి "సంప్రదాయం" అని పేరు పెట్టి అడ్డగోలుగా వాదించేస్తున్నారు.
స్వాతంత్ర్యమొచ్చిన నాటి నుంచి తొలి పాతికేళ్ల కాలంలో రాజకీయనాయకులెవరూ రాష్ట్రపతులు కాలేదు. ఇప్పుడేమో రాజకీయనాయకులకు తప్ప ఇతరులకు ఆ అర్హత లేదంటున్నారు. ఈ కొత్త 'సంప్రదాయం' ఎక్కణ్ణించి వచ్చింది?
ఒకే వ్యక్తి రాష్ట్రపతిగా రెండుసార్లు ఉండకూడదంటున్నవాళ్ళు ఆమేరకు రాజ్యాంగసవరణ ఇన్నేళ్ళూ ఎందుకు చెయ్యలేదు? అవున్లే, 'సంప్రదాయం' అని పేరు పెడితే, అవసరమొచ్చినప్పుడు తమకు నచ్చిన విధంగా వాడుకోవచ్చు, అవసరం లేనప్పుడు "ఈ ఒక్కసారికీ" అని మినహాయించుకోవచ్చు, లేదా "అబ్బే, అదసలు సంప్రదాయమే కాదు! ఒకవేళ సంప్రదాయమే ఐనా పాటించనక్ఖర్లేదు" అని చేతులు దులుపుకోవచ్చు. రాజ్యాంగసవరణ చేస్తే ఆ అవకాశముండదు కదా?

Friday, 23 February 2007
సిగ్గు! సిగ్గు!!
సమస్త దేశాన్నీ ఆశీర్వదించే నెపంతో జాతీయపతాకాన్ని సదరు మాతాజీ తన పాదాల కిందేసి తొక్కిందా లేక కేవలం తన పాదాల మీద పరిపించుకుందా అనేది కాదు ప్రశ్న. ఎట్టి పరిస్థితుల్లోనూ నేలను తాకకూడని జాతీయపతాకాన్ని నేల మీద పరిచారా లేదా...అదీ ఒకరి పాదాలను తాకేలా అన్నదే. అదీ పదహారేళ్ళపాటు ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఒక మాజీ అయ్యేయెస్ అధికారి సమక్షంలో! ఈ ఫోటోలే దిగ్భ్రాంతికరం కాగా "అమ్మగారి" పాదపద్మాల మీద పతాకాన్ని ఉంచి దేశం సుభిక్షమైపోవాలని కోరుకునే మూర్ఖశిఖామణులను సమర్థిస్తూ వచ్చిన వ్యాఖ్యలను చూసి ఏమనుకోవాలో అర్థం కాలేదు. ఈ పేజీలో నాలుగో వ్యాఖ్య రాసిన అజ్ఞాత పాఠకుడు అంటున్న "పరమసత్యం (Ultimate Truth)" ఏంటో నాకైతే బోధపడలేదు.
Thursday, 4 January 2007
ఉలిపికట్టె
ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెదింకొకదారి అని సామెత. ఇక్కడ ఉలిపికట్టెను నేనే! ఒకటిరెండు విషయాల్లో నేను నిజంగా ఉలిపికట్టెనేనేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఉదాహరణకు నా రూమ్మేట్లందరూ టీవీకి అతుక్కుపోయి క్రికెట్ మ్యాచ్ చూస్తున్న సమయంలో అసలా మ్యాచ్ ఎవరెవరికి మధ్య జరుగుతోందో కూడా పట్టించుకోకుండా నా పనిలో నేను నిమగ్నమవడం మా రూం లో సాధారణంగా కనబడే దృశ్యం. మరే ఇతర క్రీడా లేనంతగా రోజంతా మాత్రమే కాకుండా రోజుల తరబడి కూడా ఆడే ఆట కూడా ఇదొక్కటే! ఎవరైనా క్రికెట్ గురించి నాతో మాట్లాడబోతే 'ఊ', 'ఆ' అని ఊకొట్టడమే తప్ప నేనెప్పుడూ సంభాషణ పొడిగించను.
టీవీలో మ్యాచులు చూడను, సరే! పేపరులో కూడా స్పోర్ట్స్ పేజీలో క్రికెట్ గురించి చదవడం మానేశానీమధ్య. ఎందుకంటే క్రికెట్ గురించి నేను చదివి తెలుసుకోదగ్గ విశేషాలన్నీ మొదటి పేజీలోనే ప్రత్యక్షమౌతూ ఉంటే ఇంకా స్పోర్ట్స్ పేజీలో కూడా క్రికెట్ గురించే చదవడమెందుకు? అదీ నా ఆలోచనాధోరణి. మరి నేను ఉలిపికట్టెను కాదంటారా?
కొంతమంది...కొంతమందేమిటి లెండి చాలా మంది కూడూ నీళ్ళూ కూడా మానేసి క్రికెట్ చూడడమే గాక క్రికెట్ గురించి మాట్లాడుతూ కూడా కూడూ నీళ్ళూ మరిచిపోగలరు. క్రికెటర్ల క్రీడానైపుణ్యాల గురించి, క్రీడారాజకీయాల గురించి, బీసీసీఐ నిర్వహణ గురించి అంతులేని ఉత్సాహంతో తమ చుట్టూ ఉన్నవారికి తమ అభిప్రాయాలు, సూచనలు అందజేస్తూ ఉంటారు. అలాంటివాళ్ళందరికీ నా విన్నపం: మీ చర్చోపచర్చల ద్వారా భారత క్రికెట్ ను సంస్కరించగల సత్తాయే మీకుంటే మీ చర్చలను దయచేసి మనదేశంలో శాసనవ్యవస్థ మీదికి, చట్టాలు అమలౌతున్న తీరు మీదికి మళ్ళించండి. దేశానికి మీరు అంతకంటే చెయ్యగల గొప్ప సేవ మరి ఉండబోదు.
కోట్లాది మందికి రోజుల తరబడి నిరర్థకంగా గడపగల గొప్ప అవకాశాన్నిచ్చింది క్రికెట్. అసలు క్రికెట్ ఆటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా - టెస్ట్ మ్యాచైతే ఐదు రోజులపాటు, వన్ డే ఐతే ఒక రోజంతా - జరుగుతుంది. ఇంత సుదీర్ఘ సమయాన్ని హరించే ఆట మరేదీ లేదు. ఈ విషయంలో ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి ఆటను 20 ఓవర్లకు కుదిస్తున్నారనుకోండి.
అసలు ఆటల ప్రధానోద్దేశ్యం వ్యాయామం. క్రికెట్ ఆట జరిగేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి: మైదానంలో ఇరుజట్లలో మొత్తం కలిపి ఉండే 13 మంది ఆటగాళ్ళలో ఎప్పుడు చూసినా కనీసం 9-10 మంది కదలామెదలక ఊరికే నిలబడి ఉంటారు:
బౌలర్ బంతి విసిరేటప్పుడు బౌలర్, స్ట్రైకింగ్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ మాత్రమే "అలర్ట్" గా ఉంటారు. వాళ్ళలో "కదిలేది" బౌలర్ ఒక్కడే! మిగిలినవాళ్ళు 10-12 మంది.
బ్యాట్స్‌మెన్ పరుగులు తీసేటప్పుడు పరిగెత్తేవాళ్ళు మహా ఐతే నలుగురు (ఇద్దరు బ్యాట్స్‌మెన్ పరుగుల కోసం, ఇద్దరు ఫీల్డర్లు బంతి కోసం). మిగిలినవాళ్ళు 9 మంది.
ఈ పరిగెత్తే అవసరం ప్రతి బంతికీ రాదనే విషయం మనం లెక్కలోకి తీసుకుంటే మైదానపు ఆటల్లో (out-door games) ఇంత "రిలాక్సింగ్ గేమ్" ఇంకొకటి లేదు.
అలాగే సామాన్య ప్రేక్షకుల సమయాన్ని ఇంతగా వ్యర్థం చేసే ఆటా మరొకటి లేదు. క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటే చాలు. కార్యాలయాల్లో పనిచేసేటందుకు పెద్ద పెద్ద మొత్తాల్లో జీతాలు తీసుకునేవారు సైతం పనిమానేసి క్రికెట్ గురించే ఆలోచించడం, 'స్కోరెంత?' తో మొదలుపెట్టి రోజంతా క్రికెట్ గురించే కబుర్లు చెప్పుకోవడం. ఇదీ వరస.
ఇది చాలనట్లు గత సంవత్సరంలో ఒకసారి క్రికెట్ ఆటను ప్రత్యక్షంగా చూడలేకపోవడం తమ ప్రాథమిక హక్కులకు భంగం అని భావించి సుప్రీమ్‌కోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం వేయడమే పిచ్చికి పరాకాష్ట అనుకున్న నన్ను సుప్రీమ్‌కోర్టు ఆ పిటీషన్ను తోసిపారెయ్యకుండా విచారణకు స్వీకరించడం అయోమయంలో పడవేసింది. టీవీలో వార్తాఛానెళ్ళు నిమిషానికొకసారి, ఇంటర్నెట్లో కొన్ని వెబ్‌సైట్లు ప్రతి బంతికి ఒకసారి (ball-to-ball updates) విశేషాలను అందిస్తుండగా ఈ పిచ్చేమిటా అని. నా ఆలోచనాధోరణిలో లోపమేమైనా ఉందా?
పోనీ మన దేశంలో ఇంత ఆదరణ పొందుతున్న ఈ ఆటలో మన జట్టు సాధిస్తున్న విజయాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయా? అంటే అదీ లేదు. ఉలిపికట్టెను ఐతే అయ్యానుగానీ ఈ క్రికెట్ పిచ్చి నాకు లేనందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ క్రికెట్ మూలంగా జనాలు మరో ఆట గురించి, మరో వ్యాపకం గురించి ఆలోచించడమే మానేశారు. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం.
ఐతే క్రికెట్ వల్ల లాభాలే లేవా అంటే లేకేం? ఉన్నాయి.
1. జట్లు జట్లుగా ఆడే ఆటల వల్ల ఉండే ప్రయోజనమొకటుంది. అదే: ఆడేవాళ్ళలో "నేను, నా" అనే భావనలకు బదులుగా "మనం, మన" అనే భావనలు బలపడడం. ఆటలో రాజకీయాలు, స్వార్థప్రయోజనాలు చోటుచేసుకోనంతవరకు ఇది ఖచ్చితంగా ప్రయోజనమే. ఇది ఆటగాళ్ళకు కలిగే ప్రయోజనం.
2. ఇక ప్రేక్షకుల్లో కుల, మత, జాతి, వర్ణ, వర్గ భేదాలు సమసిపోతాయి క్రికెట్ విషయంలో. అలాగే
3. 'స్కోరెంత?' అనే మాటకు ఏ మంత్రానికీ లేని శక్తి ఉంది - ఇద్దరు అపరిచితుల మధ్య మాటలు కలపడంలో.
ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయా? మీకు తెలిస్తే చెప్పండి.

Sunday, 10 September 2006
ఏది శాశ్వతం?
ఏది శాశ్వతం? మనుషుల జీవితాలు శాశ్వతమా? చనిపోయినవారి జ్ఞాపకాలు శాశ్వతమా? భవిష్యత్తరాలవారికి గతించిన మహానుభావులను గుర్తుచేసే విగ్రహాలు శాశ్వతమా? ఏదీ శాశ్వతం కాదు. మీమీ ఊళ్ళలో ఉన్న ప్రముఖుల విగ్రహాలు కూడా పరమపదించే ప్రమాదముంది తెలుసా? అదీ సహజమరణం కాదు. బలవన్మరణం. అందుకే మీరు ఈసారి ఏ ట్యాంక్‌బండు వైపో వెళ్ళినప్పుడు అక్కడున్న తెలుగుతేజాల విగ్రహాలనొకసారి కనులారా దర్శించుకోండి. బహుశా అవే చివరి చూపులు కావచ్చు. రేపటినుంచి మీకు ఆ అవకాశం కూడా దక్కకపోవచ్చు. పట్టణాలలో గతంలో ప్రతిష్టించిన విగ్రహాలను తొలగించి వాటి స్థానంలోనే ఇందిర, రాజీవ్ ల విగ్రహాలను ప్రతిష్టింపజేసే విగ్రహయజ్ఞం ప్రారంభమైంది. వయ్యెస్సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినవెంటనే అదే వేదిక మీదనుంచి గొంతు బొంగురుపోయేలా, దిక్కులు పిక్కటిల్లేలా అరిచి అరిచి చెప్పాడు: "రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. రాష్ట్రం యొక్క రూపూరేఖా స్వరూపాలు మారుస్తాం!" అని. దాని అర్థం మీకింకా బోధపడలేదా? రేప్పొద్దున మీరు అద్దంలో చూసుకున్నా రాజీవ్, ఇందిరల రూపాలే కనిపిస్తే కంగారుపడకండి.
నిన్న, మొన్న ప్రొద్దుటూరులో జరిగిన పరిణామాలివి:
నిన్న:

మొన్న:

Monday, 10 April 2006
తెలుగుకు పట్టిన తెగులు
ఏది తెలుగు? ఏది కాదు?
ఓ మహాత్మా! ఓ మహర్షీ!!
తెలుగు పద సంపద పెరగాలి. కొత్త పదాలు పరభాషల్నుంచి వచ్చినా అభ్యంతరం లేదు కానీ మనం విపరీతంగా వాడే పరభాషా పదాలు తెలుగును పరిపుష్టం చేసే మాట అటుంచి ఉన్న తెలుగు పదాల్నే మింగేస్తూంటే భాష అభివృద్ధి చెందేదెలా?
'చీటికి మాటికి ఏమిటీ గోల?' అని చిరాకు పడే వాళ్ళు దయచేసి ప్రసిద్ధ రచయిత, అనువాదకుడు అయిన డా.ఉప్పల లక్ష్మణరావు వ్రాసిన ఈ కథ చదవండి~:
ఒకానొకప్పుడు - అనగా వన్స్ అపానె టైమ్ ఇన్ ది వోల్డెన్ డేస్ - ఒక పేద ముసలివాడు - తెలుగులో చెప్పాలంటే - యె పూర్ వోల్డుమాన్ - జీవించుతూ ఉండే వాడు. వాడు ముసలివాడవడం చేతనూ, అండ్ దట్ టూ పూర్ మాన్ అవడం చేతనూ వాడికి యీ లోకంలో నూకలు చెల్లి పోయాయి - అనగా సింపుల్ తెలుగులో ఎక్స్ ప్లెయిన్ చెయ్యాలంటే - వాడు డెత్ బెడ్ మీద లై అయివున్నాడు. ఆ వోల్డు అండ్ పూర్ మాన్ కి టూ సన్స్ అండ్ వన్ డాటరూ ఉన్నారు. పెద్ద సన్నుకి ఫార్టీ యియర్సూ, చిన్న సన్ను కి ట్వెంటీ యియర్స్.
వన్ డాటర్ యొక్క యేజి ముప్ఫై - అనగా సింపుల్ టెలుగూలో థర్టీ యియర్సు. డాటర్ కి యుక్త వయస్సు రాక ముందే, సంతానం కలగక పూర్వమే వైధవ్యం సంప్రాప్తించింది - టు పుట్ ఇట్ ఇన్ స్పోకెన్ టెలుగూ - షి బికేమ్ యె చైల్డు విడో విథౌట్ చిల్డ్రన్ ఆరె హస్బెండు. అందుచేత ఆ యంగు విడో తండ్రి పంచన చేరింది - అనగా చక్కని తెలుగులో చెప్పాలంటే ఆమె ఫాదర్ పైనే యెంటైర్ గా డిపెండై, ఫాదర్స్ హౌస్ లోనే లివ్ చేస్తూ లైఫ్ ఈక్ ఔట్ చేస్తూ ఉండేది.ఆ ఓల్డ్ అండ్ పూర్ మాన్ కి డెత్తు వెరీ నియరై, టుడే ఆర్ టుమారో అన్నట్టుండడమ్ చేత తన టూ సన్స్ అండ్ వన్ డాటర్ ని తన డెత్ బెడ్డు దగ్గరికి రమ్మని వర్తమానమంపించెను - అనగా ఇన్ టెలుగూ~: బెడ్ సైడ్ కి రావలసిందిగా వర్డు పంపించాడు - అదే ఇడియమాటిక్ టెలుగూలో చెప్పాలంటే ఆర్డరు చేశాడు. వాళ్ళు డెత్తు బెడ్డుని సమీపించిన అనంతరం - అనగా మన వాడుక భాషలో అప్రోచి అయిన తర్వాత, తన చిల్డ్రెను కి ఈ విధంగా ఇన్ ఫారం చేశాడు~:
"నేను పూర్ మాన్ని. నాకు ఏ కైండాఫ్ ఆస్థిపాస్థులూ లేవు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే నేను ప్రాపర్టీలెస్ ఫకీర్ని. నాకున్న చరాస్థి అంతా - అనగా మన టెలుగూ లో మై మూవబుల్ ప్రాపర్టీ యావత్తూ - ఓన్లీ పద్ధెనిమిది గోవులు మాత్రమే - అనగా సులభశైలి టెలుగూ లో యెయ్ టీన్ కౌసు మాత్రమే. ఈ యెయ్ టీన్ కౌస్ లోనూవన్ కవ్ ని నా లాస్ట్ మోమెంట్సు లో సింగినాథపు సింగయ్య సిద్ధాంతి గారికి గోదానం నా చేత ఆఫర్ చేయించండి. నేను ఆ వన్ కౌ టెయిలు పట్టుకుని రివర్ వైతరిణిని క్రాస్ చేసి హెవెన్ రీచయి శాశ్వత ఇంద్ర భోగం అనుభవిస్తాను - ఇన్ సింపుల్ టెలుగూలో పెర్మనెంట్ గా పారడైజులో ఫర్ యెవ్వర్ గా లివ్ చేస్తాను. ఇక రిమెయినింగ్ సెవెన్ టీన్ ఆవులని మీ త్రీ మధ్యా పంచుకోంఢి - అనగా చేస్ట్ టెలుగూ లో చెప్పాలంటే - డివైడ్ చేసుకోంఢి. ఎల్డెర్ సన్నుకి జేష్ఠ భాగం న్యాయం కనుక - అనగా వ్యావహారిక టెలుగూలో చెప్పాలంటే జస్ట్ అండ్ ఫెయిర్ కాబట్టి - సెవెన్టీన్ గోవుల్లోనూ సంగోరు భాగం - అనగా టెలుగూలో చెప్పాలంటే సెవెన్ టీన్ కౌసులోనూ హాఫ్ ది నంబరు పెద్ద సన్నుకీ, చిన్న సన్ కి సెవెన్ టీను కౌసులోనూ మూడింట ఒక పాలూ - అదే ఈజీ టెలుగూలో చెప్పాలంటే వన్ థర్డూ - ఇహ తలచెడ్డ గొడ్డు ముండకి - అనగా క్లీన్ షేవెన్ మరియూ చైల్డ్ లెస్ మరియూ హస్బెండ్ లెస్ విడోకి - మీకూ, మీ వైఫ్ లకీ మీ చిల్డ్రెన్ లకీ సేవ చేసేంహుకు గానూ - అనగా శిష్ఠ వ్యవహారిక టెలుగూలో చెప్పాలంటే - డెయ్ లీ కుక్ చేసీ, యుటెన్సిల్స్ క్లీన్ చేసీ, హౌస్ వాష్ చేసే ఇత్యాది డాంకీ వర్కు చేసేందుకు గానూ - దానికి తొమ్మిదింట ఒక భాగమూ, అనగా సింపుల్ టెలుగూలో ఎక్స్ ప్రెస్ చేసి చెప్పాలంటే కౌస్ నంబర్ లో వన్ నైన్తూ - వచ్చేటట్టు కౌస్ ని డివైడ్ చేసుకుని హాపీగా లివ్ చేయండి. ఇహ వెళ్ళి - అనగా గో అండు ఫెచ్ సిద్ధాంతి గార్నీ!"
సిద్ధాంతి గారు వచ్చి గోదానం పట్టిన తర్వాత - అనగా కౌని డెత్ గిఫ్టుగా రిసీవ్ చేసుకున్న తర్వాత - ఆ వోల్డ్ అండు పూర్ మాను శాశ్వతంగా కన్ను మూశాడు - అనగా వాడుక భాషలో చెప్పాలంటే డైడ్ అయిపోయాఅడు. పిత్రు వాక్య పాలనకై - అనగా యీజీ టెలుగూ లాంగ్వేజీలో - ఫాదర్స్ లాస్ట్ విషెస్ కి రెస్పెక్ట్ ఇవ్వడానికని - వాళ్ళు టూ బ్రదర్సూ అన్డ్ వన్ విడోడ్ సిష్టరూ - మల్లగుల్లాలు పడ్డం మొదలుపెట్టారు. వాళ్ళలో వాళ్ళకి డివిజన్ ఆఫ్ ది కౌస్ తెగక తగాదాలు పడుతూండగా - అనగా ఫైట్ చేస్తూండగా, సిద్ధాంతి గారు తన వన్ కౌనీ సేల్ చెయ్యడానికని వెళ్తూ ఆ తోబుట్టువులకి - అనగా టూ బ్రదర్స్ అండ్ వన్ సిష్టరుకి ఎదురు పడ్డాడు. ఆ టూ బ్రదర్స్ అండ్ వన్ సిష్టరూ ఆ సిద్ధాంతి గార్ని ఇలా అర్థించారు - అనగా తెలుగులో చెప్పాలంటే రిక్వెస్టు చేశారు.
"మేము మా గోవుల్ని విభజిచుకోలేకుండా వున్నాం - అనగా కరెక్టుగా డివైడ్ చేసుకోలేకుండా వున్నాం. దయుంచి మాకు సహాయమొనరించ ప్రార్థన - అనగా స్పోకెన్ టెలుగూలో చెప్పాలంటే - ప్లీజ్ మాకు హెల్ప్ చేయవలసింద"ని అతనిని బెగ్ చేశారు.
సిద్ధాంతి గణిత శాస్త్రజ్ఞుడు- -అనగా స్వచ్ఛమైన టెలుగూలో చెప్పాలంటే అతడు మాథమెటీషియను - కాబట్టి నిమేష మాత్రం దీర్ఙ్హాలోచనాపరుడై - ఇన్ ఈజీ టెలుగులో చెప్పాలంటే - ఫైవ్ మినిట్స్ పాటు థింక్ చేసి ఇలా అన్నాడు~:
గతించిన మీ తండ్రి గారు మిమ్మల్ని ముగ్గురినీ మూడు చెరువుల నీళ్ళు త్రాగించి ముప్పు తిప్పలు పెట్టారన్న మాట నిజం.అనగా చక్కని టెలుగూ నానుడిలో ఆనొటేట్ చెయ్యాలంటే - మీ ఫాదర్ మీ త్రీ పీపుల్ నీ ...త్రీ టాంకు వాటర్సూ తాగించి మిమ్మల్ని ట్రబుల్స్ లో పెట్టాడనడం నిజమే అంటే ఇటీజ్ ట్రూ. నేను మీకు సహాయం చేస్తాను - అనగా నేను మీకు హెల్ప్ చేస్తానుకానీ నా వద్ద ఒక ఏకైక గోవు మాత్రమే కలదు - అనగా మీకు అర్థమయేటట్లుఆర్డినరీ వాడుక భాషలో చెప్పాలంటే నాకు వోన్లీ వన్ కౌ మాత్రమే ఉన్నది.ఐనప్పటికీ ఆ వన్ కౌనీ మీ పదిహేడు ఆవులతోనూ కలుపుకునీ - అనగా సింపుల్ టెలుగూలో మీకర్థమయేటట్టు చెప్పాలంటే మీ సెవెన్టీన్ కౌస్ కీ నా కౌ యాడ్ చేసిమీ జనకుడి ఆజ్ఞను పాలించి ఆస్తి విభజించుకోండి అనగా సింపిల్ అండ్ ఈజీ టెలుగూలో చెప్పాలంటే - మీ ఫాదర్ గారి విషెస్ ప్రకారం మీ కౌస్ ని డివైడ్ చేసుకుని యేదైనా గోవు శేషించిన యెడల దానిని నాకు తిగి ఇచ్చి వేయండి" అన్నాడు - అనగా వాడుక భాషలో లేక స్పోకెన్ టెలుగూలో చెప్పాలంటే - ఇఫ్ ఎ కౌ కనక రిమెయిన్ అయిపోతే ఆ కౌ ని నాకు రిటర్న్ చేసేయండి." అని సలహా చెప్పాడు - అనగా అడ్వైస్ చేశాడు.
ఆ ప్రకారం వాళ్ళు గోవులను పంచుకోగా - అనగా డివైడ్ చేసుకోగా, జ్యేష్ఠుడికి తొమ్మిది గోవులూ - అనగా యెల్డర్ సన్ కి నైన్ కౌసూ, రెండో వాడికి ఆరు గోవులూ - అనగా ఠెలుగులో చెప్పాలంటే సిక్స్ కౌసూ, బాల వితంతువు సోదరికి - అనగా ఇస్స్యూలెస్సూ మరియు హస్బెండ్లెస్సూ అయి వున్న వర్జిన్ విడోకి - రెండు గోవులూ - అనగా టూ కౌసూ పంచుకోగా ఒక గోవు - సిద్ధాంతిగారి గోవు మిగిలి పోవడమూ చూసి - వన్ కౌ రిమెయినింగ్ గా ఉండడం చూసి వాళ్ళు ముగ్గురూ వండర్ స్ట్రక్ ఐ పోయారు. ఆ మిగిలిపోయిన గోవు సిద్ధాంతిగారిదవడం చేత దానిని ఆయనకి వాపస్ అప్పనం ఇచ్చి వేశారు.అనగా వాడుక భాష టెలుగూలో చెప్పాలంటే ఆయనకు రిటర్న్ చేసి తమ కృతజ్ఞతాభివందనములను ఆయనకు అర్పించారు - అనగా వ్యవహారిక టెలుగూ లాంగ్వేజీలో చెప్పాలంటే తమ గ్రేట్ ఫుల్ థ్యాంక్స్ ని ఆఫర్ చేసి స్వగృహానికి వెళ్ళి పోయారు - అనగా శిష్టులు స్పీక్ చేసే టెలుగూలో చెప్పాలంటే వారి హౌస్ కి రిటర్న్ అయిపోయారు. ఇంతటితో కథ సమాప్తం- అనగా ది స్టోరీ హాజ్ గాన్ టు ది ఫెన్స్ అని వాడుకభాషలో అర్థమూ.
"వికాసం" సభ్యుడు,
టెలుగూ రచయిత,
డబ్ల్యూ ఎల్ రావు.
ట్వంటీ~:టెన్ ~:1971
బెర్ హెం పూర్
(గంజామ్)

స్పోకెన్ టెలుగులో చిల్డ్రెన్ కి ఎ షార్ట్ స్టోరీ

Subscribe to:
Posts (Atom)