Friday, 23 February, 2007

సిగ్గు! సిగ్గు!!

సమస్త దేశాన్నీ ఆశీర్వదించే నెపంతో జాతీయపతాకాన్ని సదరు మాతాజీ తన పాదాల కిందేసి తొక్కిందా లేక కేవలం తన పాదాల మీద పరిపించుకుందా అనేది కాదు ప్రశ్న. ఎట్టి పరిస్థితుల్లోనూ నేలను తాకకూడని జాతీయపతాకాన్ని నేల మీద పరిచారా లేదా...అదీ ఒకరి పాదాలను తాకేలా అన్నదే. అదీ పదహారేళ్ళపాటు ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఒక మాజీ అయ్యేయెస్ అధికారి సమక్షంలో! ఈ ఫోటోలే దిగ్భ్రాంతికరం కాగా "అమ్మగారి" పాదపద్మాల మీద పతాకాన్ని ఉంచి దేశం సుభిక్షమైపోవాలని కోరుకునే మూర్ఖశిఖామణులను సమర్థిస్తూ వచ్చిన వ్యాఖ్యలను చూసి ఏమనుకోవాలో అర్థం కాలేదు. ఈ పేజీలో నాలుగో వ్యాఖ్య రాసిన అజ్ఞాత పాఠకుడు అంటున్న "పరమసత్యం (Ultimate Truth)" ఏంటో నాకైతే బోధపడలేదు.

14 comments:

మాకినేని ప్రదీపు said...

మనము ఎవరినయినా ఒప్పించొచ్చు కానీ అలా వ్యాక్తుల్ని ఆరాధించే వాళ్ళను మాత్రం ఒప్పించలేము. భక్తి ముసుగులో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారని చెప్పినా వినరు. మీరు చూపించిన ఉదాహరణ దానికి పరాకాష్ట మాత్రమే.

lalitha said...

Why even give this kind of incident any significance by posting it?

radhika said...

పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే.

చదువరి said...
This comment has been removed by the author.
వీవెన్ said...

చదువరీ, :-)

Nagaraju Pappu said...

మిత్రులారా:
ఇలాటి కామెంట్స్ రాసేటప్పుడు మీరో సంగతి గుర్తుకుంచుకోండి:
బ్లాగర్లు జర్నలిస్టులు కారు -అందుకని, మనకి వాళ్ళకుండే లీగల్ హక్కులు గాని, institution protection గాని లేదు. Similarly, newspapers and other publications protect their journalists by concealing their names. this is a big issue right now in the worldwide blogging community. Until, we know what our legal rights are, we should be very careful about how and what political and other opinions we express on the internet.

Remember, every single word you type on your machine is now stored, sorted, and analyzed. Our conversations are no longer ephimeral.

for your own safety, stay as much neutral as you can .. please...

u can report anything you want, but don't react...

anyway .. caduvari .. you said it man..

--nagaraju pappu

చదువరి said...

త్రివిక్రమ్, ఈ జాబుకు నే రాసిన గత వ్యాఖ్యను తొలగించాను. బహుశా అది ఇతరుల బ్లాగుల్లో ఒక వ్యాఖ్యగా రాయదగినది కాకపోవచ్చు. (నా బ్లాగులో నేనేం రాసుకున్నా నాదే బాధ్యత) దాని కారణంగా ఈ బ్లాగుకు ఇబ్బంది కావచ్చని ఊహించలేక పోయాను. ఈ తప్పు కాయండి.

సుధాకర్ said...

క్షమించండి నాగరాజు గారు, నేను మీతో ఏకీభవించటం లేదు. జర్నలిష్టులకు ప్రత్యేకంగా లీగల్ హక్కులనేవి ఏమీ లేవు. వుంటే అవేవో తెలుపగలరు. ఈ దేశంలో అందరికీ వాక్ స్వాతంత్రం, భావాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ సమానంగా ఇవ్వబడ్దాయి. దేశానికి కీడు తలపట్టే పనులకు, వ్యాఖ్యలకు తప్ప. అసలి పాత్రికేయిల కంటే ఎక్కువ స్వాతంత్రం వున్నది బ్లాగర్లకే. అవసరం లేనప్పుడు neutral గా వుండటం కంటే బ్లాగింగు నుంచి తప్పుకోవటం మంచిది. లేని neutrality పాఠకులని మోసగిస్తుంది. చదువరి గారు మీరనుకున్నది కూడా తప్పే.

సుధాకర్(శోధన) said...

అంటే మీరనుకున్నట్లు "వ్యాఖ్యగా రాయదగినది కాక పోవచ్చు" అనేది తప్పని నా అభిప్రాయం :-) ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఎవ్వరికీ నొప్పించే ఉద్దేశం నాకు లేదు :-)

Nagaraju Pappu said...

సుధాకర్ గారు,
ఇందులో నొచ్చుకొందుకేం లేదు. మీకింకా ఇంటర్నెట్ వెనకాలున్న చీకటి ప్రపంచం గురించి తెలిసినట్టు లెదు. కొద్దిరోజులాగండి -- నేనో టపా రాస్తున్నాను ఈ విషయం మీద. చాలా బ్లాక్-మైల్లు,brain-mapping, personality-profiling, threats .. there is so much is going on.

in any case, for a very good resource about blogging, and advise for bloggers - see the followig site:
http://www.eff.org/bloggers/
hope it helps
--nagaraj

సుధాకర్(శోధన) said...

మీ వ్యాసం కోసం ఎదురు చూస్తున్నాం. ఇంటర్నెట్ గురించి మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా.. గానీ ఇక్కడ జరిగింది ఒక ఇంటర్నెట్ క్రైమ్ అంటారా? మీరు ఇచ్చిన లంకె చాలా మంచిది. చదివిందే కానీ మరలా చదివా ఒక సారి :-)

రవి వైజాసత్య said...

నాగరాజు గారన్నది చాలా నిజం..విమర్శనాత్మక విషయాలు రాయలంటే ఒక ఆకాశరామన్న ఐడీ సృష్టించుకోవడం మంచిది. స్వతంత్రము లేదనికాదు..జాగ్రత్త ఎల్లవేళలా మంచిది..అయినా చదువరి ఇక్కడ రాయకూడని లెవెల్లో ఏం రాశారబ్బా..మిస్సయ్యా..ఇంగ్లీసులో నా భావాలు రాయటం ఎంతో సులభమైనా తెలుగులో రాయటం కొంత భద్రతా కారణాల వల్లే.

చదువరి said...

రవీ, నేను తీసేసిన ఆ వ్యాఖ్యను తీసుకుపోయి నా బ్లాగులో పెట్టేసాను. దొంగ సాధ్వులు, సాధువులు అనే నా జాబులోని చివరి వాక్యాలే నేనిక్కడ రాసినది.నిజానికి దానిపట్ల త్రివిక్రమ్ కు అభ్యంతరం ఏమీ ఉండేది కాదుగానీ, అది మరీ దురుసుగా ఉందని నాకే అనిపించి ఇక్కడి నుండి దాన్ని తీసేసాను.

కొత్త పాళీ said...

రవి గారూ, తెలుగులో రాసినంత మాత్రాన భూషయ్య గూఢచారుల కళ్ళబడకుండా ఉంటామనుకుంటే మీరు పొరబడ్డారు.