ఏది శాశ్వతం? మనుషుల జీవితాలు శాశ్వతమా? చనిపోయినవారి జ్ఞాపకాలు శాశ్వతమా? భవిష్యత్తరాలవారికి గతించిన మహానుభావులను గుర్తుచేసే విగ్రహాలు శాశ్వతమా? ఏదీ శాశ్వతం కాదు. మీమీ ఊళ్ళలో ఉన్న ప్రముఖుల విగ్రహాలు కూడా పరమపదించే ప్రమాదముంది తెలుసా? అదీ సహజమరణం కాదు. బలవన్మరణం. అందుకే మీరు ఈసారి ఏ ట్యాంక్‌బండు వైపో వెళ్ళినప్పుడు అక్కడున్న తెలుగుతేజాల విగ్రహాలనొకసారి కనులారా దర్శించుకోండి. బహుశా అవే చివరి చూపులు కావచ్చు. రేపటినుంచి మీకు ఆ అవకాశం కూడా దక్కకపోవచ్చు. పట్టణాలలో గతంలో ప్రతిష్టించిన విగ్రహాలను తొలగించి వాటి స్థానంలోనే ఇందిర, రాజీవ్ ల విగ్రహాలను ప్రతిష్టింపజేసే విగ్రహయజ్ఞం ప్రారంభమైంది. వయ్యెస్సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినవెంటనే అదే వేదిక మీదనుంచి గొంతు బొంగురుపోయేలా, దిక్కులు పిక్కటిల్లేలా అరిచి అరిచి చెప్పాడు: "రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. రాష్ట్రం యొక్క రూపూరేఖా స్వరూపాలు మారుస్తాం!" అని. దాని అర్థం మీకింకా బోధపడలేదా? రేప్పొద్దున మీరు అద్దంలో చూసుకున్నా రాజీవ్, ఇందిరల రూపాలే కనిపిస్తే కంగారుపడకండి.
నిన్న, మొన్న ప్రొద్దుటూరులో జరిగిన పరిణామాలివి:
నిన్న:
మొన్న:
6 comments:
ఇది ఘోరం, అక్రమం. సరస్వతీ పుత్రుని జ్ఞాపకాల పట్ల ఈ ధృతరాష్ట్ర సంతతి జరుపుతున్న అత్యాచారం ఇది. బురదలో దొర్లే పందులకు సువాసనలు సయించవు. మనందరం ఖండించాలి.
ఇది దుశ్చర్య.
cbrao
http://groups.yahoo.com/group/biosymphony/
http://deeptidhaara.blogspot.com/
http://paradarsi.wordpress.com/
ఇది ఘోరం, అక్రమం. సరస్వతీ పుత్రుని జ్ఞాపకాల పట్ల ఈ ధృతరాష్ట్ర సంతతి జరుపుతున్న అత్యాచారం ఇది. బురదలో దొర్లే పందులకు సువాసనలు సయించవు. మనందరం ఖండించాలి.
భారతదేశాన్ని తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులనుండి అతి తక్కువ కాలంలోనే బయటపడవేసి, విదేశీ నిల్వలను పెంపొందించిన దార్శనికుడు, మన తెలుగు తేజం అయిన స్వర్గీయ పి.వి. గారికి ఈ దుర్మార్గులు జరిపిన దౌష్ఠ్యం ఇంకా మరచిపోకముందే, ఇంకో దురహంకారమైన చర్య. అత్యంత నీతి బాహ్యమైనది. ముక్తకంఠంతో ఖండించతగిన సంఘటన.
ఇక్కడ కొన్ని తుగ్లక్ పోలికలు కనిపిస్తున్నాయేంటబ్బా? పిచ్చెవరికో? చివరికి మిగిలేది ఇందిరమ్మేనా?
alage kanipistundi lendi.inkonnaalla ki mana andhra raastaram peru kuda indiramma rastarm ani maripoyina aashryaponakkarledemo?
Post a Comment