Monday, 28 August 2006
పుస్తక సమీక్షలు-బ్లాగు సమీక్షలు
ప్రస్తుతం పుస్తక సమీక్షలెలా ఉంటున్నాయో ఈ ఒక్క కార్టూను చూస్తే తెలుస్తుంది. రాబోయే కాలంలో పత్రికల్లోని పుస్తకసమీక్షలు ఈ కార్టూనులో చూపినట్లే ఉంటాయేమో? (ఒక పుస్తకం అట్ట మీద ఆ పుస్తకం గురించి 300 పదాల పరిచయవాక్యాలుంటే దాని మీదొచ్చిన సమీక్షను 200 పదాలతో సరిపెట్టేశారట!!)
పుస్తక సమీక్షల పరిస్థితే అలా ఉండగా ఇంకొక వైపు బ్లాగుల గురించి సవివరమైన సమీక్షలు రాస్తున్న భాస్కర రావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఇప్పటి వరకు తెలుగు మహిళా బ్లాగరులందరి బ్లాగుల గురించి సమీక్షలు రాశారు. తాను చదివిన మంచి పుస్తకాల గురించి తన బ్లాగులో చర్చించే వి.బి.సౌమ్య గారి బ్లాగును ఈరోజు ఆయన సమీక్షించారు. ఆయన సమీక్షలు మహిళా బ్లాగరుల బ్లాగులకే పరిమితం కాలేదు. చరసాల, చావా కిరణ్, త్రివిక్రమ్ లాంటి వారి బ్లాగుల మీద కూడా సుదీర్ఘమైన సమీక్షలు రాశారు. ఆయన చేస్తున్న కృషికి నా హృదయపూర్వక అభినందనలు.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
తెలుగు బ్లాగుల ప్రచారానికై నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. బ్లాగు సమీక్షలు రాసి బ్లాగులకు అవసరమైన ప్రచారం కల్పిస్తున్నా.తెలుగు బ్లాగుల గురించి ఎక్కువ మందికి తెలియదు.మహిళల బ్లాగులైతే కొద్ది మంది కి మాత్రమే తెలుసు.వాటికి ప్రాచుర్యం తీసుకు రావాలనే తలంపుతో చేస్తున్నవే ఈ సమీక్షలు.పనిలో పనిగా తెలుగులో ఎవరైనా బ్లాగు రాయాలనుకుంటే వారికి తెలుగుబ్లాగ్ గుంపు నుంచి సహాయం అందుతుందని కూడ చెప్తున్నా. త్రివిక్రం బ్లాగ్ సమీక్ష మన మిత్రుల సౌలభ్యానికై, ఎక్కువమంది చదవటానికి వీలుగా అవి-ఇవి బ్లాగు ద్వారా కూదలిలో ఉంచటానికి వీలవుతుందా? పుస్తకానికి ముందుమాటలా ఈ సమీక్ష బ్లాగుకు ముందుమాటగా చేసే సాంప్రదాయానికి ఇది నాంది కాగలదు.
Post a Comment