Friday, 16 March 2007

క్లాసిక్ అనగా...

తెలుగులో నేను అదీ ఇదీ అని లేకుండా అన్ని రకాల పుస్తకాలూ చదువుతాను. ఇంగ్లీషులో ఒకప్పుడు షేక్స్‌పియర్ నాటకాల నుంచి లేటెస్ట్ బూతు నవలల దాకా అన్ని రకాలూ (రకానికి ఒకటి రెండు చొప్పున) చదివాను. ఇది పదేళ్ళ కిందటి సంగతి. తర్వాత నా స్నేహితుడు లక్కీ నాకు బహుమతిగా ఇచ్చిన Midnight's Children చదువుదామని మొదలుపెట్టి మధ్యలోనే మానేశాను. ఆ పుస్తకం గత ఐదేళ్ళుగా నా పుస్తకాల అరలో అలాగే పడి ఉంది. ఆ తర్వాత గత సంవత్సరం ప్రపంచంలో ఇంగ్లీషొచ్చిన ప్రతివారూ కలవరించిన పుస్తకం, ఇంగ్లీషు పుస్తకాల సమీక్షల్లో ప్రపంచప్రఖ్యాతి పొందిన TLS (Times Literary Suppliment) చేత "un-putdownable book" గా ప్రశంసించబడిన Da vinci code బలవంతాన వారం రోజులపాటు ప్రయత్నించి నలభై పేజీలు చదివి పక్కన పడేశాను. అది సంవత్సరం నుంచి పలకరించే నాథుడు లేక దుమ్ముకొట్టుకుపోయింది. ఇంగ్లీషు పుస్తకాలు చదివే అలవాటు తప్పిపోయిందా అంటే నాన్-ఫిక్షన్ ఇప్పటికీ అమితాసక్తితో చదువుతూనే ఉన్నాను. అంటే ఇంగ్లీషులో ఫిక్షన్ చదవడం నా వల్ల కావడం లేదా? ఇది నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇటీవల ఒక ప్రముఖ రచయితతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు Da vinci code చదవలేక పక్కనపడేసిన విషయం ప్రస్తావించాను. దానికి ఆయన "చదవాలంటే ముందు మనకు దాని మీద ఆసక్తి పుట్టాలి. Da vinci code మనకు తెలిసిన జీవితాలకు గానీ, మన సంస్కృతికి గానీ సంబంధం లేని రచన కావడం కూడా ఆ ఆసక్తి కలగకపోవడానికి కారణం కావొచ్చు." అన్నారు. అదే నిజమేమో? నేను డావిన్సీ కోడ్ చదవనంత మాత్రాన కొంపలేం మునిగిపోవు. కానీ ఏ ఆర్కే నారాయణో, రస్కిన్ బాండో, మనోజ్ దాసో రాసిన పుస్తకాలు చదవడానికి ప్రయత్నించి విఫలమైతే అది నిజంగా ఆందోళన పడాల్సిన విషయమే! మరి Midnight's children సంగతేంటి? అది మన దేశాన్ని గురించి రాసిందే కదా? ఐనా నేను దాన్ని చదవలేకపోవడమేమిటి? దీనికి కారణం ఇటీవలే తెలిసింది: సాల్మన్ రష్దీ, బిల్ క్లింటన్ లాంటివాళ్ళ రచనలు చదవడం కష్టమేనట. ఇది నా ఒక్కడి సమస్య కాదట. చాలామంది చదవడం మొదలుపెట్టి పూర్తిచెయ్యకుండానే వదిలేస్తారట.

Midnight's children ఒక క్లాసిక్. ఈ వార్త చదవగానే "Classic is a book which everyone praises but noone reads." అన్న ఫన్నీ కోట్ గుర్తొచ్చింది.

8 comments:

Unknown said...

నేను ఫిక్షన్ చాలా ఎక్కువగా చదువుతాను. అదీ ఇదీ అని లేదు, ఎలాంటి ఫిక్షన్ అయినా నాకు ఇష్టమే. అదే కాక హారీ పాటర్ వంటివయితే ఇంకా ఇష్టం.
నేను చదివే నాన్ ఫిక్షన్ ఎక్కువగా పర్సనాలిటీ, మేనేజ్మెంట్ టైప్ వి అయి ఉంటాయి. "who moved my cheese", "rich dad poor dad" వంటివి.
కానీ ఇంకా నాకు నాన్ ఫిక్షన్ చదవటం అలవాటు కాలేదు.

అవును నిజమే మనకు ఇంటరెస్ట్ కలిగించనంత వరకూ, కనెక్ట్ అవనంత వరకూ దేనినయినా చదవడం కష్టమే. ఉదాహరణకి "mein kamf, my experiments with truth" లాంటివి చదవడం ఇంతవరకూ కుదరలేదు.

కానీ మన సంస్కృతి కాకపోయినా డాన్ బ్రౌన్ నవలలు నాకు నచ్చాయి. మరేంటో.

కొత్త పాళీ said...

పద్ధతి మీకు సరిగ్గా వ్యతిరేకం. కథ అని చెప్పి (తెలుగులో గాని, ఇంగ్లీషులో గాని) ఎంత చెత్త ఇచ్చినా చదివేస్తాను. నన్నడిగితే చెత్తనే తేలిగ్గా చదివెయ్యొచ్చు అంటను. నేను ముగించడానికి కష్టపడ్డ పుస్తకం డొస్టోయెవ్స్కీ క్రైం అండ్ పనిష్మెంట్ ఒక్కటే. అదికూడా రష్యన్లు చేసిన ఘోరమైన ఆంగ్లానువాదం వల్ల. చివరికి విజయవాడ నించి కాన్పూరు 36 గంటల సుదీర్ఘ రైలు ప్రయాణంలో దీక్షపట్టి పూర్తి చేశాను. నేను ఏకబిగిన ముగించిన ఇంకొన్ని నవలా రాజాలు - వడ్డెర అనుక్షణికం, టోల్స్టొయ్ వార్ అండ్ పీస్, డ్యూమా కౌంట్ ఆఫ్ మాంటెక్రిస్టో, మొ.
రష్డీ వచనం చదవటం కష్టం - ఎందుకంటే శతకోటి ప్రఛ్ఛన్న చమత్కారాల్ని ప్రతి వాక్యంలోనూ దట్టిస్తాడు. ఇలా పేజీల తరబడి వాటిని మింగుతూంటే త్వరలోనే అజీర్తి చేస్తుంది. ఈ లక్షణం Midnight's Children లో మరీని. దీనికొక్కటే మార్గం - మింగింది జీర్ణించుకునే అవకాశం పుచ్చుకుంటూ చదవాలి. Reading Rashdie is always a long project.
Da Vinci Code నలభై పేజీలు దాటలేదూ అంటే .. మీకు ఫిక్షన్ మీదనే అంత ఆసక్తి లేదన్న మాట. లేదా మీ స్నేహితులన్నట్టు చదివే కథలో ఏదో ఒక సామాజిక అంశం నచ్చేట్టు ఉండాలన్న మాట.
ఎందుకు సార్, వర్రీ? హాయిగా మీకు నచ్చినవే చదువుకోండి.
ఈ మాట ఎవరన్నా అన్నారో లేక నాకు నేనే అనుకున్నానో -
Life is too short to waste on bad literature. There's a lot of good stuff out there.
పై వాక్యంలో bad, good తీసేసి "నచ్చని, నచ్చిన" అని పెట్టుకుని హాయిగా చదువుకోండి :-)
అన్నట్టు ప్రజాకళలో పి. సత్యవతి గారి ఇంటర్వ్యూ చూశారా?

Anonymous said...

వీటికి తాతలు రాసిన మహానుభావుడు జేంస్ జాయిస్. ఫిన్నెగన్స్ వేక్, యులీసిస్ లు ఉద్గ్రంధాలు. నాకు కొరుకుడుపడని కొయ్యలు

గిరి Giri said...

Salman Rusdhie's writing have that 'naarikela rasam' quality..too tough to get to the juice. In my case with "Midnight's children" and then with "Satanic Verses", after 100 pages or so i decided the quest wasn't worth it..

రానారె said...

my experiments with truth - చాలా సులభంగా అర్థమయే పుస్తకం. ఇది connect కాని పుస్తకం కానే కాదు. తెలుగులో చదవటం బాగుంటుందనుకుంటే తెలుగులోనూ మంచి అనువాదం ఉంది. ఇందులో గాంధీ తన జీవితంలో జరిగిన తప్పొప్పులను నిజాయితీగా ప్రస్తావించే తీరు మనందరికీ కనెక్ట్ అయేవిధంగానే ఉంటుంది. మనల్ని ప్రభావితం చేసే అంశాలు కనీసం రెండయినా ఈ పుస్తకంలో ఉంటాయి.

Anonymous said...

I thought I was the only one who had trouble reading Gandhiji's work. The problem for me has been 2 fold. I guess the English, the way it comes out because of translation, is difficult for me to keep me interested in reading. The second is the pain and the very honest detail of Gandhiji's internal struggle . I have been eager to move past the beginning pages and read the later part but I couldn't, the last couple of times I tried. I will keep trying.

త్రివిక్రమ్ Trivikram said...

@ప్రవీణ్: బ్రౌన్ నవలలు నచ్చాయంటే ఆ ఆకర్షణ అలాంటిది మరి. :) ఎందుకో నాకే రుచించలేదు.

@కొత్తపాళీ: చాలా వివరంగా చెప్పారండీ. థ్యాంక్యూ. సత్యవతి గారి ఇంటర్వ్యూ ఇంకా చదవలేదు. చదువుతా.

@రవి: జాయిస్ రచనల గురించి సరిగ్గా ఇలాంటి అభిప్రాయమే ఎక్కడో చదివిన గుర్తు. :)

@గిరి: నారికేళ పాకం! సరిగ్గా చెప్పారు. ఎపుడో ఒకసారి పీచుపీకి కాయకొట్టి చూస్తా.

@రానారె: నేను సత్యశోధన, దీంతోబాటు చాలా పుస్తకాలు - గోర్కీ అమ్మ (Mother), టాల్‌స్టాయ్ కోసక్కులతో సహా రష్యన్ పుస్తకాలు అనేకం, హేలీ ఏడుతరాలు (The Roots), మొదలైనవి తెలుగులోనే చదివాను. తెలుగులో ఐతే కనెక్ట్ కాకపోవడమనే ప్రశ్నే లేదు.

@లలిత: ఆ పుస్తకంలోని ఇంగ్లీషు ఎలాంటిదో నాకు తెలియదు. కానీ అది కూడా చాలా నిరాడంబరంగా, సామాన్యులభాషలాగే ఉంటుందనుకుంటున్నా. Anyhow, keep trying. :)

Anonymous said...

ఇన్నాళ్లకు చదువుతున్నా ఈ టపాని :)
నేను ఓ ఏడెనిమిది నెల్ల క్రితం దాకా నాన్-ఫిక్షన్ ఎక్కువగా చదివే దాన్ని. ఈ కాలేజీ కి వచ్చాక ఫిక్షన్ ఎక్కువ గా చదువుతున్నా....
డావిన్సీ కోడ్ నేను ఏకబిగిన చదివిన పుస్తకాలలో ఒకటి. :)
కథలు అంటే సాధారణంగా నేను కూడా అవి ఎలా ఉన్నా చదివేస్తూ ఉంటాను. :)