Wednesday, 1 November, 2006

మా తెలుగుతల్లికి మల్లెపూదండ

4 comments:

చదువరి said...

పాలు తాగిన రొమ్మునే గుద్దే రకపు రాజకీయులొచ్చి, అసలు తెలుగుతల్లి అనే భావనే లేదు అని కొత్త సూక్తులు చెబుతున్నారు, కల్లబొల్లి ఏడుపులు ఏడుస్తున్నారు. తెలంగాణ కూడా ఆ తల్లి ఒడిలోదే అనే సంగతి వీళ్ళకు తెలియక కాదు, తల్లి అనే భావన తెలుగువారి ఐక్యతకు దోహదం చేస్తుందేమోనని భయం. అందరం ఒకటే అని జనం అనుకుంటే వీళ్ళ ఆటలు సాగవు కదా! వేరు రాష్ట్రం కావాలనుకుంటే సాధించుకోవచ్చు, తప్పులేదు. కానీ వీళ్ళలా అమ్మ రొమ్మును గుద్దీ, ఆత్మనమ్ముకునీ కాదు కదా!

మన్నించండి, నా తిట్లకు మీ బ్లాగును వేదిక చేసుకున్నందుకు.

రవి వైజాసత్య said...

ముగ్గురమ్మల మాయమ్మ అని ఇప్పుడు తెలంగాణ తల్లి, సీమ తల్లి, కోస్తా తల్లి వచ్చాయన్న మాట. ఆ తరువాత తరంలో నెల్లూరు తల్లి, కరీం తల్లి, నిజాం తల్లి, నల్గొండ తల్లి, గోదావరి తల్లి. తల్లుల సంతతి వృద్ధి. అప్పుడు తెలుగు తల్లి పోయి చేగర్రతో గూనిగా నడవలేక మూలనపడుండే తెలుగు ముసలవ్వ అవుతుంది :-)

subbayya said...
This comment has been removed by the author.
T.Balasubrahmanyam said...

TRS వాళ్ళు ఈరోజు రాజకీయంగా చాలా బలహీనులు. వాళ్ళ మాటలు పెద్ద సీరియస్‌గా తీసుకో పన్లేదు. కాని మొదట అవి విన్న తరువాత చాలా బాధనిపించింది.నాకు అన్నం సహించలేదంటే నమ్మండి.నిద్ర కూడా పట్టలేదు.ఆస్తి పంచి ఇవ్వమని అన్నయ్య మీద కొట్లాడే తమ్ముడు కూడా ఇంత దిగజారడు కదా ! అనిపించింది.ప్రాంతీయాభిమానం భాషాభిమానం కంటే బలవత్తరమై పోయిందే ! ప్రాంతీయాభిమానంతో మనుషులు ఇంత వివేకహీనులు,గుడ్డివాళ్ళు అయిపోతారా ? అనిపించింది.తెలంగాణాలో మాట్లాడేది తెలుగు కాదంటే ఇంక తెలంగాణావారికి మిగిలే సంస్కృతి చరిత్ర ఏముంటాయి ? అనే అనుమానం కూడా ఇలాంటివారికి రాలేదే ! ఇలాంటి మాటలు ఎవరైనా అంటే మా గుంటూరులో చెప్పులతో సత్కరించి పిచ్చాసుపత్రికి మోసుకెళతారు. కాని ఈ "కారు" కూతలు కూసిన వెధవాయిని కొంతమంది తెలంగాణావాళ్ళు నాయకుడుగా గౌరవిస్తున్నారు. అదే చాలా ఆశ్చర్యంగా ఉంది.

పోనీలెండి ! వాళ్ళు కూడా తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. మూర్ఖుడికి "అలా చెయ్యడం తప్పురా నాయనా ! " అని చెప్పిన కొద్దీ ఇంకా రెచ్చిపోయి అదే చేస్తాడు. ఆ ముచ్చటలేవో తీర్చుకోనివ్వండి. పాతబడితే వాళ్ళకే విసుగొస్తుంది.

http://www.kalagooragampa.blogspot.com/