Friday 25 July, 2008

బెంగుళూరులో బాంబు పేలుళ్ళు - ఒకరి మృతి, 15 మందికి గాయాలు

ఈరోజు శుక్రవారం మధ్యాహ్న నమాజు సమయంలో బెంగుళూరు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో కొన్ని నిమిషాల తేడాలో 7 బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో ఒక మహిళ చనిపోగా పదహైదు మంది గాయపడ్డారని ప్రాథమిక సమాచారం. ఈ పేలుళ్ల గురించిన వార్తలు సర్వత్రా వ్యాపించడం వల్ల ఒత్తిడి పెరిగి టెలిఫోన్ నెట్వర్కులు జామ్ అయ్యాయి. మడివాళ, అడుగోడి, కోరమంగళ, హోసూరు రోడ్డు, మైసూరు రోడ్డు, నాయదహళ్ళి లలో పేలిన ఈ బాంబులు తక్కువ తీవ్రత గల నాటు బాంబులని, టైమర్ సహాయంతో వీటిని పేల్చారని పోలీసులు తెలిపారు. పేలుళ్ళు జరిగిన ప్రాంతాలకు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లను పంపారు. పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్ళను మూసేశారు. జమ్మూ కాశ్మీరులో అమరనాథ్ యాత్రీకుల సౌకర్యార్థం ఆలయ బోర్డుకు రాష్ట్రప్రభుత్వం 40 హెక్టార్ల అటవీభూమిని కేటాయించబోయి విరమించుకున్న నేపథ్యంలో ఈ పేలుళ్ళు హిందూ అతివాదుల చర్య అని అనుమానిస్తున్నారు.

Update:

పేలుళ్ళ వివరాలు:


1. 1.20 pm, మడివాళ బస్ డిపో

2. 1.25 pm, మైసూరు రోడ్డు

3. 1.40 pm, అడుగోడి

4. 2.10 pm, కోరమంగళ

5. 2.25 pm, విఠ్ఠల్ మల్లయ్య రోడ్డు

6. 2.35 pm, లాంగ్ ఫోర్డ్ టౌన్

7. రిచ్ మాండ్ టౌన్

6 comments:

జాన్‌హైడ్ కనుమూరి said...

ied for I tried for u on phone
but so far i could not get u

Rajendra Devarapalli said...

హిందూ/ముస్లిం ఎవరైనా తీవ్రవాదులైనప్పుడు వారికి ఆయా మతాలపేళ్ళను వాడుకునే హక్కుండదు.ఈపేలుళ్ళను ఇతర అతివాదదుశ్చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
త్రివిక్రం గారు,అక్క్డడ మీరు,మీకుటుంబసభ్యులూ,మనబ్లాగర్లందరూ క్షేమంగ ఉన్నారని భావిస్తున్నాను.

వికటకవి said...

హిందూ సంస్థలా? సమర్ధిస్తున్నానని కాదు గానీ, మనవాళ్ళెంత వెధవలయినా మరీ ఇంత వెధవలు కారు. ఆ ఊహ ఖచ్చితంగా నిజం అవదనే నా నమ్మకం.

చైతన్య.ఎస్ said...

' హిందూ అతివాదుల చర్య ' ఇది ఎంత వరకు నిజమో మరి.. కాకపొతే ఇందులోని రాజకీయ కోణం గురించి కూడ ఆలోచించాలి అని నా అభిప్రాయం. సిమి,లష్కర్ మొదలైన సంస్థల ప్రమేయం పైన కూడా అనుమానాలు ఉన్నాయి కదా!. బహుశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వారి లక్ష్యం అయివుండవచ్చు. నిఘా వర్గాల దృష్టి మరల్చడం, పెద్ద ఎత్తున దాడి చెయ్యడం వారి, రాజకీయంగా అస్థిరత కల్పించడం వారి లక్ష్యం.

Anonymous said...

దీన్ని చూస్తుంటే భయోత్పాతం సృష్టించడానికి చేస్తున్నట్టనిపిస్తోంది. నిజంగానే చంపాలనుకుంటే ఏదైనా సెలవు రోజు జన సమ్మర్దం వున్న చోటు పెట్టి వుండే వాళ్ళు. బహుశా కొత్తగా వచ్చిన బి.జె.పి. కి హెచ్చరికలు పంపించారేమో మీరొచ్చినా ఏం పీకలేరని.

రాజేంద్రా చెప్పినట్టు అందరూ బాగేనా?

-- విహారి

త్రివిక్రమ్ Trivikram said...

బెంగుళూరు తెలుగు బ్లాగర్ల క్షేమసమాచారం గురించి ఆదుర్దా పడినవారందరికీ ధన్యవాదాలు. పేలుళ్ల వెనుక ఎవరున్నదీ ఇంకా తేటతెల్లం కానప్పటికీ ఇటీవలి సంవత్సరాలలో కర్ణాటకలో ఊపందుకొన్న సిమి (SIMI)హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇక్కడ వాడిన పేలుడు పదార్థాలు హైదరాబాదులోని గోకుల్ చాట్, లుంబిని పార్కు, మక్కా మసీదు పేలుళ్లలోను, లక్నో, హుబ్లీ కోర్టుల్లో జరిగిన పేలుళ్లలోను వాడిన పదార్థాల్లాంటివే అని National Bomb Data Centre వర్గాలు తెలిపాయి.