ఈ బ్లాగులో అప్పుడప్పుడూ వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ఫోటోలు చూపించి ఆ ఫోటోల్లోని వ్యక్తులెవరో చెప్పుకోండి చూద్దాం అని ఒక క్విజ్ లాగ నడుపుదామని నాకొక ఆలోచన వచ్చింది. శాస్త్రవేత్తగా మారిన ఒక హాలీవుడ్ నటి హెడీ లమర్ గురించి దాదాపు రెండేళ్ళ కిందట "ఆమె ఒక శాస్త్రవేత్త. ఆమె వెండితెర వేలుపు. ఆమె ఒక సాహసి. ఆమె ఒక సౌందర్యరాశి." అని అడిగి సమాధానం కూడా నేనే చెప్పేశాను. ఆ తర్వాత ఈ క్విజ్ ఆలోచన వచ్చింది గానీ ఇప్పటిదాకా ఆచరణలో పెట్టలేదు. ఇప్పుడు కాచుకోండి: ఈ ఫోటోలోని వ్యక్తి ఒక ప్రముఖ తెలుగురచయిత. ఈయనెవరో చెప్పుకోండి చూద్దాం.
క్లూలు కావాలా? ఐతే ఒకటి అందుకోండి: ఈయన వాసికెక్కిన రచయిత. మల్లాది వెంకటకృష్ణమూర్తి కాదు కాబట్టి ఈయన ఫోటోలు ఈయన పుస్తకాలపైనేగాక అంతర్జాలంలో కూడా కనబడుతాయి.
9 comments:
Kommanapalli Ganapathi Rao
అలాగా.. ఐతే అప్పట్లో ఆంద్ర భూమి WEEKLY లో వీరి మొదటి SERIAL చదివాను.. అంతగా గుర్తు లేదు కాని.. CHESS సంబంధించి వీరి 'గొప్ప' దనం మాత్రం గుర్తుంది.(IN THAT SERIAL)
@ కార్తీక్,
కాదు. కొమ్మనాపల్లి గణపతిరావుకు గడ్డముంటుంది.
@ జల్లిపల్లి కృష్ణారావు గారూ,
ఆయన మొదటి సీరియల్ అవునో కాదోగానీ ఆయన అమ్మ సెంటిమెంటు మీద రాసిన ఒక నవలలో ఇంకా చాలా పజిల్సున్నాయి - తొమ్మిదిని తుడపకుండా ఆరు చెయ్యడం లాంటివి.
సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి :)
గురువుగారూ!
చప్పట్లు!!
గూగుల్ పేజెస్ లో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ప్రొఫైల్.
నా బ్లాగులో ఆయన రచనల పాక్షిక పరిచయం, ఒక కవిత. ప్రముఖ కవయిత్రి స్వాతీ శ్రీపాద గారు సన్నపురెడ్డి కథలను ఆంగ్లంలోకి అనువదించారు. ఈ అనువాదాలు సాహిత్యనేత్రంలో వస్తున్నాయి.
ఈ ఫోటో నేను తీసిందే. దురదృష్టవశాత్తూ అప్పుడు నా దగ్గర కెమెరా లేక సెల్ ఫోన్ తోనే గుడ్డి వెలుగులో తీసిన ఫోటో ఇది.
ఇప్పుడు ఈయన ప్రస్తావన ఎందుకంటే ఈనెల 12న (వచ్చే శనివారం) కడపలో సన్నపురెడ్డి కథాసంపుటి కొత్త దుప్పటి ఆవిష్కరణ జరుగుతుంది.
ఓ! థాంక్యూ త్రివిక్రమ్.
ఈ ఫోటో పోటీ ఆలోచన చాలా బాగుంది. ఫోటోల సంగతెలా వున్నా రచయితల గురించి, వాళ్ల రచనల గురించి ఇక్కడ జరిగే చర్చల్లో తెలుసుకునే మంచి ఆవకాశం ఇది.
థ్యాంక్యూ రానారె,
అన్నట్లు పొద్దులో కూడా సన్నపురెడ్డి కవిత ఒకటి వేశాం: విషాద సంధ్య.
''ఆయన మొదటి సీరియల్ అవునో కాదోగానీ ఆయన అమ్మ సెంటిమెంటు మీద రాసిన ఒక నవలలో ఇంకా చాలా పజిల్సున్నాయి - తొమ్మిదిని తుడపకుండా ఆరు చెయ్యడం లాంటివి.''
అలాగా .... చాలా సంతోషం.
మల్లాది కాదు. అంతర్జాలంలోనూ ఇతని రచనలు ఉన్నాయి.
యండమూరి కాదు (కొంచెం పోలికలు కనిపిస్తున్నాయి)
యర్రంశెట్టి సాయి అని నా గెస్.
కేవలం ఫోటోలే కాకుండా, కొంచెం స్వపరిచయం, లేదా ఏ రకమైన రచనలకి ప్రసిద్దుడు లాంటి క్లూ లతో క్విజ్ నిర్వహించ వచ్చునేమో అని నా విన్నపం.
Post a Comment