Monday, 11 August 2008

ఒలింపిక్స్ లో స్వర్ణంతో భారత్ బోణీ

"ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురై వస్తే..." హృదయం నిజంగానే ఆనందంతో ఎగసి ఎగసి పడుతోంది. 1980 మాస్కో ఒలింపిక్స్ లో హాకీలో వచ్చింది, 28 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో ఒక స్వర్ణ పతకం. అభినవ్ బింద్రా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 700.5 పాయింట్లతో బంగారు పతకం గెలుచుకున్నాడు. 8 స్వర్ణ, ఒక రజత, రెండు కాంస్యాలను గెలుచుకున్న గతమెంతో ఘనకీర్తి గల మన జాతీయ క్రీడ హాకీని మినహాయిస్తే ఇప్పటి వరకు మనం గెలుచుకున్న ఒలింపిక్ పతకాలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు: 1900 పారిస్ ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్ లో నార్మన్ ప్రిచార్డ్* (200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హర్డిల్స్ లో) రెండు రజతాలు, 2004 సిడ్నీ ఒలింపిక్స్ లో షూటింగ్ (డబుల్ ట్రాప్)లో లెఫ్టినెంట్ కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఒక రజతం గెలుచుకోగా
1952 హెల్సింకీ ఒలింపిక్స్ లో కుస్తీలో ఖషబ దాదాసాహెబ్ జాధవ్,
1996 అట్లాంటా ఒలింపిక్స్ లో టెన్నిస్ లో లియాండర్ పేస్,
2000 సిడ్నీ ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో కరణం మల్లీశ్వరి ఒక్కో కాంస్యం గెలుచుకున్నారు.
-------------------
*భారత్ లో పుట్టి పెరిగిన నార్మన్ ప్రిచార్డ్ ఒక ఆంగ్లేయుడు. 1905 లో ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు.

4 comments:

Unknown said...

త్రివిక్రమ్ గారూ,

పొద్దున్నే శుభవార్త చెప్పారు. సంతోషం. మీరిలా ఎన్నో శుభవార్తలందించాలని కోరుకుంటూ...

Anonymous said...

సంతోషించాల్సిన సమయం. అభినందించాల్సిన విషయం.

Unknown said...

నాకయితే భలే ఆనందంగా అనిపించింది ఈ వార్త వినగానే.
పొద్దున్న ఆఫీసుకి వెళుతుంటే మా కాబులో సహచరుడు చెప్పాడు.

నాకసలు ఇవాళ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అయినా దానిని మించిన సంతోషం కలిగి ఊరటనందించింది ఈ వార్త.

త్రివిక్రమ్ Trivikram said...

చాలా ఆలస్యమైపోయింది. ఐనా... కామెంటిన ముగ్గురికీ నెనర్లు.