Friday, 19 May 2006

యండమూరి రచనలు

తెలుగు సాహిత్య చరిత్రలో యండమూరిదో విశిష్ట స్థానం.
ఆయన రచనల్లో నేను చదివిన వాటి గురించి నా అభిప్రాయం:

ది బెస్ట్ ఆఫ్ యండమూరి వీరేంద్రనాథ్: ఒకటి రెండు కథలు అస్పష్టంగా, అర్థం కాకుండా ఉన్నాయి. అర్థమైనవన్నీ చాలా బాగున్నాయి. కొన్ని కథలు అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తప్పక చదవవలసిన పుస్తకం.

వెన్నెల్లో ఆడపిల్ల: రొమాంటిక్ థ్రిల్లర్
ఆనందోబ్రహ్మ: "సరళ ‌లలితమైన పదాల సన్నజాజి పందిరి"
అంతర్ముఖం: గొప్ప రచన
డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు: గెలవడానికి కావలసింది పట్టుదల, తెలివితేటలేనని చెప్పే చక్కటి పుస్తకం
డబ్బు మైనస్ డబ్బు: చెత్త నవల
కాసనోవా: చక్కటి శిల్పంతో వ్రాసిన మంచి థ్రిల్లర్
తులసీదళం & తులసి: ఈ నవలలను సరిగ్గా అర్థం చేసుకోని వాళ్ళు, పాఠకుల తెలివితేటలను తక్కువగా అంచనా వేసినవాళ్ళు అనవసరంగా వివాదం సృష్టిచారు.
ప్రియురాలు పిలిచె: "ప్రేమకు థర్డ్ డైమెన్షన్"
ప్రేమ: "మృదుమధుర మంజుల నవలానాదం"
ధ్యేయం: ఇలాంటి నవలలే అవసరం
చీకట్లో సూర్యుడు: అంతా బాగానే ఉంది గానీ ఫ్యూచరాలజీలో పాస్టాలజీ కి సంబంధించిన బాల్యవివాహాలను మిక్స్ చేయడమే పంటికిందరాయిలా తగులుతూ ఉంటుంది. చిన్న వయసులో గర్భం వస్తే పుట్టేది అష్టావక్రలే గానీ డిజైనర్ బేబీలు కాదు.
అతడు ఆమె ప్రియుడు: వికృతీకరించిన 'ఏకవీర'
వెన్నెల్లో గోదావరి: మంచి నవల
యుగాంతం: నేను చదివిన మొట్టమొదటి సైన్స్ బేస్డ్ ఫిక్షన్. చక్కటి మనో విశ్లేషణ.

7 comments:

Anonymous said...

మంఛు పర్వతం: స్త్రీ మనస్తత్వం గురించి మంచి విశ్లేషణ
13-14-15:భార్యా భర్తల మధ్య ఉండాల్సిన మంచి కముఊనికషన్ గురించి
పర్ణ శాల:అచ్చమైన వాస్తవికత(సెంటిమెంట్ కి తావు లేకుండా)
రాధ-కుంతి:అంత ఉపయోగం లేదు కాని అదే పుస్తకం లో అనుబంధం గా ఉన్న కధలు బాగున్నాయి.
నల్లంచు తెల్లచీర:చివరివరకు హీరో వైపు నుంచే అలోచించిన పక్షపాతం కనిపిస్తుంది.
ఒక వర్షాకాలపు సాయంత్రం:నన్ను నిరాశ పరచిన యండమూరి ఎకైక నవల

త్రివిక్రమ్ Trivikram said...

నేను చదవని పుస్తకాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి స్పందనను ఆశించేనండీ నేను ఇది, దీని తర్వాతి రెండు పోస్టులు రాసింది.

రానారె said...

"మీరు మంచి అమ్మాయి కాదు" - అనే చిన్న పుస్తకం కూడా రాశారు.

రాధిక said...

ఒక వర్షాకాలపు సాయంత్రం చదవలేక పోయానని చాలా బాధ పడుతూ వుంటాను.చీకట్లో సూర్యుడు గురించి అసలు తెలీనే తెలీదు.అతడు ఆమె ప్రియుడు నాకు అస్సలు నచ్చలేదు.తులసీ దళం,అష్టావక్ర నేను చదివిన తొలి యండమూరి నవలలు.ధ్యేయం చాలా మంచి నవల.13-14-15 అందరూ చదవాల్సినది.మంచి ఇంఫర్మేషన్ వుంటుంది.వెన్నెల్లో గోదారి,ప్రియురాలు పిలిచే,వెన్నెల్లో ఆడపిల్ల గిలిగింతలు పెడుతూ వుంటాయి ఎన్ని సారులు చదివినా.నల్లంచు తెల్ల చీర ఈ నవలని ఆడవాళ్ళు తప్పుగా అర్దం చేసుకున్నారని యండమూరి బాధపడినా అయన అంతా మగవాళ్ళ వైపునుండే అంతా రాసారన్నది మాత్రం నిజం,మంచు పర్వతం బాగుంటుంది.

త్రివిక్రమ్ Trivikram said...

@రానారె: ఈ టపాకు యండమూరి రచనలు అని పేరు పెట్టి కేవలం కాల్పనిక రచనల గురించే రాసినట్లున్నాను. కాల్పనికేతర రచనల గురించి ఇంకొక టపా రాయాలి. :) గుర్తుచేసినందుకు థ్యాంక్స్!

@రాధిక: "ఒక వర్షాకాలపు సాయంత్రం చదవలేక పోయానని చాలా బాధ పడుతూ వుంటాను." పైన స్వాతిగారు రాసింది చదివాక కూడానా?! ఆశ్చర్యం!!
చీకట్లో సూర్యుడు తెప్పించుకునైనా చదవండి. ఇది బహుశా తెలుగులో వచ్చిన "ది బెస్ట్" సైన్స్ ఫిక్షన్ నవల. (ఇది ఆంగ్లంలో వచ్చిన ఏదో నవలకు కాపీ అని ఆరోపణలున్నాయి. ఆ నవల నేను చదవలేదు కాబట్టి ఏం చెప్పలేను కానీ ఈ నవల మాత్రం ఈ టపాలో నేను చెప్పిన లోపం మినహాయిస్తే అద్భుతంగా ఉంటుంది). మంచుపర్వతం లాంటి నవలలు మరిన్ని రావాలి. కానీ ఏం చేద్దాం? సాహిత్యంలో గ్రెషమ్ సూత్రం అమలవుతూ ఉంటుంది.

Anonymous said...

Hi everybody,
Greetings to you all. This is my first post. I have been reading most of your blogs and reaaallllly enjoying myself.
If anybody is interested reading novels online (including Yandamuri's) go to teluguone.com, select "stories and novels."

Best wishes to you all,
Kala.


P.S: Don't blame me if you are spending lots of time reading them :)

రాధిక said...

దుప్పట్లో మిన్నగు---మనిషిని భయం అన్నది ఎంత ఎలా భయపెడుతుందో బాగా తెలియచేస్తుంది.
లేడీస్ హాస్టల్---తొలి రేయిలో భార్యకి చెప్పిన చిన్న అబద్దం నిజమై కళ్ళ ముందు కనిపించినా ఆ భార్య భర్త పై చూపించిన విస్వాశం,చివరి దాకా అతనికి అండగా నిలబడి హత్యా నేరం నుండి బయటకి తెసుకురావడం
నిశ్శబ్దం నీకు నాకు మధ్య---బాగానే వుంటుంది గానీ మధ్య మధ్య లో కొద్దిగా బోర్ అనిపిస్తుంది

స్వాతి గారు చెప్పక ముందు వరకు బాధ పడేదాన్ని.ఆ కామెంట్ చూసాకా ఏమీ లేదు.కానీ నవల దొరికితే మాత్రం చదివి తీరుతాను. ఇంకా కొన్ని నవలలు కూడా చదివాను కానీ కధాంశాలు గుర్తులేదు.ఒక సారి పైపైన మళ్ళా చదివి చెపుతాను.