Saturday 19 April, 2008

చందమామ కాఫీటేబుల్ బుక్ లేక 60th Year Anniversary Book లేక...

...చందమామ కలెక్టర్స్ ఎడిషన్. చందమామ పత్రిక ప్రచురణ ప్రారంభమై అరవయ్యేళ్ళు పూర్తైన సందర్భంగా చందమామ పాత సంచికల్లోని కథలను పుస్తకాలుగా ప్రచురిస్తామని ప్రచురణకర్తలు ప్రకటించి ఉన్నారు. ఆ పుస్తకాల్లో మొదటిది సిద్ధమైంది. అదే చందమామ కాఫీటేబుల్ బుక్ లేక 60th Year Anniversary Book లేక... ...చందమామ కలెక్టర్స్ ఎడిషన్. ఆ పుస్తకాన్ని అమితాబ్ బచ్చన్ మొన్న ముంబాయిలో ఆవిష్కరించారు. అది నిన్నటి నుంచే మార్కెట్లో లభ్యమౌతోందని ప్రకటించారు. వెల 449 రూపాయలు. చందమామ వెబ్సైటు నుంచి ఇప్పుడే ఆర్డరు చేస్తే 20% డిస్కౌంటు కూడా ఉంది. ఆవిష్కరణోత్సవ విశేషాలు కూడా అక్కడే చదవొచ్చు.

PS: రానారే! ఇప్పుడు నా తల 'సేఫే'నా? ;)

5 comments:

రానారె said...

ఆఁ :-)

leo said...

ఇది తెలుగులోనా ఆంగ్లంలోనా?

త్రివిక్రమ్ Trivikram said...

@రానారె: ఐతే ఇక బేతాళుడు చెట్టెక్కడం మాని బుక్కు చదవడం మొదలుపెడతాడన్నమాట. ;)

@leo: ఆంగ్లంలోనేనండీ.

రానారె said...

ఆంగ్లంలోనా! ఐతే భేతాళుడు చెట్టెక్కాల్సిందే. ఎక్కి, చందమామవారి గూటిలో పీడీయఫ్ ఆర్కైవులు చదువుకోవచ్చు.

Kiran Chittella said...

పుస్తకం తెచ్చుకున్నాను. బాగా నిరాశపరచింది.