Wednesday, 5 March 2008

బ్లాగులకు రిజిస్టర్డ్ ఫ్యాన్!

ఆర్నెల్లుగా బజ్జున్న నా బ్లాగులను ఇక లెమ్మని అదిలించారు పొద్దులో బ్లాగు శీర్షికను దాదాపు ఒంటిచేత్తో నిర్వహిస్తున్న చదువరి. అసలు ఆ అదిలింపు వెనుక పనిచేసిన అదృశ్యహస్తం ఇంకొకరిదిలెండి. ఏమైతేనేం నేను లేవక తప్పలేదు. లేచి చూద్దును కదా రానారె బ్లాగుకు కొందరు రిజిస్టర్డ్ ఫ్యాన్లు, మరికొందరు అఫిషియల్లీ రిజిస్టర్డ్ ఫ్యాన్లు అని తెలిసింది. :-) ఇది ఏమాత్రం కొత్త లేక వింతైన విషయం కాకపోయినప్పటికీ కొత్తగా బ్లాగులు చదువుతున్న/రాస్తున్న వారి సౌకర్యార్థం ఒక తెలుగు బ్లాగుకు రిజిస్టర్డ్ ఫ్యానయ్యే క్రమంలోని సోపానాలను ఇక్కడ వివరిస్తున్నాను. ఇది వివరించే అవకాశం నాకు వదిలిపెట్టిన చావా కిరణ్ కు నెనర్లు. ;-)

1. మీరు తెలుగుబ్లాగు సభ్యులై ఉండాలి.
2. మీకొక సొంత బ్లాగుండాలి.
3. మీ బ్లాగు సైడ్ బార్లో సదరు బ్లాగుకు ఒక లంకె విధిగా ఉండాలి. అప్పుడే మీరు ఆ బ్లాగుకు రిజిస్టర్డ్ ఫ్యానౌతారు. :-)

3 comments:

  1. ఆర్యా, మీ (మా) పొద్దులో ఈ అభిమాన సంఘాలకు రిజిస్ట్రేషను సౌకర్యం పెడితే బాగుంటుందని నేనూ, బావుండదని మా అన్నయ్యా పోట్లాడుకున్నాం. మీరేమంటారు?

    ReplyDelete
  2. రిజష్ట్రేషను విషయం నాకు తెలీదు గానీ మీరు మళ్ళీ బ్లాగు రాయడం హర్షించ దగినది. పొద్దువారు తట్టగానే మేల్కొన్నారు. కృతజ్ఞతలు.

    ReplyDelete
  3. ఆర్యా!
    మీ ఆలోచనే బాగుందంటాను.

    విజయకుమార్ గారూ!
    మీ అభిమానానికి నెనర్లు!

    ReplyDelete