Friday, 29 December 2006

మహారచయితకు నివాళి

ఆ కలం సృష్టించిన మాటలు, పాటలు కోట్లాది మంది సినీ ప్రేక్షకుల మీద మత్తు మందు చల్లి తమ వశం చేసుకున్నాయి. పుట్టబోయేవారిని కూడా చేసుకుంటాయి.
ఏదైనా మ్యాజిక్కో, మంత్రమో చేసినట్లు అభినయించాలంటే చిన్న పిల్లలు సైతం అసంకల్పితంగా అనే మాట "హాం ఫట్". ఆ మాటను మనకు పరిచయం చేసింది పాతాళభైరవిలో మాంతికుడు (ఎస్వీరంగారావు). మరి పుట్టించిన అపరబ్రహ్మ ఎవరు?
"డింగరీ", "గురూ", "ఘాటుప్రేమ", "ధైర్యే సాహసే లక్ష్మీ", "నరుడా ఏమి నీ కోరిక?"
అసమదీయులు - తసమదీయులు
వీరతాళ్ళు (ఈనాటి పతకాల లాంటివి)

"ఇవేం మాటలు? ఇంతకు ముందెక్కడా లేవే?" అన్నవారిని "ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?" అని ఎదురు ప్రశ్నించిన మాటల మరాఠీ ఎవరు?
"జనం కోరేది మనం సేయడమా? మనం సేసేది జనం సూడడమా?" ఈ మాటలు పలికింది నేపాళమాంత్రికుడు. ఈ సందిగ్ధం మాత్రం సినిమాలు తీసేవారందరిదీ.
"సాహసం శాయరా డింభకా! రాకుమారి లభించును రా!"
"మహాజనానికి మరదలు పిల్లా! గలగలలాడవే గజ్జెలకోడీ"
"రసపట్టులో తర్కం కూడదు"
"మాకు తల్పం వద్దు గిల్పం కావాలి....కంబళి వద్దు గింబళి కావాలి"
"శాకాంభరీదేవి వరప్రసాదం - ఆంధ్రుల అభిమాన శాకం.....గోంగూర!"

ఈ జాబితాలో వందలు వందల మాటలున్నాయి. చెప్పుకుంటే తనివితీరదు. ఆ మాటలు నెమరేసుకున్నా చాలు. ఐనా ఆ మహనీయుడిని గురించి "మాటల్లో" చెప్పడానికి మనమెంతవారం? 75 యేళ్ళ తెలుగుసినీచరిత్రలో ఎవరెస్టు శిఖరం లాంటి మాటల-పాటల రచయిత పింగళి నాగేంద్రరావు గారి నూట ఆరవ జయంతి ఈరోజు (29 డిసెంబరు).

4 comments:

  1. aa maatalu vini aanamdimcadam tappinchi avi evaru raasarani nenu eppudu aaloacimcaledu.ippati trivikram maatram telusu

    ReplyDelete
  2. ఆ మహానుభావునికి, నేను సైతం నివాళులు అర్పిస్తున్నాను....
    త్రివిక్రమునికి, ధన్యవాదములు తెలుపుకుంటున్నాను...వారిని గుర్తుచేసినందుకు..

    ReplyDelete
  3. త్రివిక్రం గారు,

    మాయాఅ బజార్ ని ఎన్ని సార్లు చూశానో తెలీదు.
    ఇప్పటికి మన నోళ్ళలో ఆ మాటలు నానుతున్నాయంటే కారణం పింగలి నాగేంద్ర రావు గారు లాంటి వాళ్ళుండబట్టే.

    ఆయనకు నా నమస్సుమాంజలి.

    విహారి.

    ReplyDelete
  4. లబ్జు అనే పదం ఆయన సృష్టేనని చదివాను. "ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి వుండనేవుందిగా" మాయాబజార్‌లో బలరాముని వుద్దేశించి శకునిపాత్రకు ఆయన రాసిన మాట నాకు చాలాచాలా గొప్పగా అనిపించింది.

    ReplyDelete