అని చందమామ అభిమానులు పరవశించి పాడుకునే రోజు ఎంతో దూరంలో లేదు. తి.తి.దే. వాళ్ళు పాత చందమామలను అమూల్య భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి డిజిటలైజ్ చేస్తున్నరని తెలిసినప్పటినుంచి అవి మనకందుబాటులోకి వచ్చేది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నా లాంటివారికిది శుభవార్త. వీటిని జనవరి 23వ తేదీ తిరుపతిలో ఆవిష్కరించి, చందమామ సంపాదకులు విశ్వనాథరెడ్డికి అందజేస్తామని తి.తి.దే. వాళ్ళు తెలిపారు. ఇవి మార్కెట్లోకి వస్తే పాత చందమామలకోసం హైదరాబాదులోని పాతపుస్తకాల షాపుల్లో వెదకడం; హిందూ లో, ఇంటర్నెట్లో ప్రకటనలివ్వడం లాంటి అవస్థలు తప్పుతాయి. :) ఇది నిజంగానే మొన్న ౧౬వ తేదీ హిందూలో వచ్చిన ఒక ప్రకటన:
Chandamama
Interested in old/very old Chandamama (Telugu) magazines. If any body interested to gift/sell at reasonable price, contact K.S.Kumar, Ph.98666-96564.
(పాత చందమామలు ఒక అగ్నిప్రమాదంలో కాలిపోయాయట. వాళ్ళ ఆఫీసులో ప్రతి సంచికా ఒకటో రెండో ప్రతులు మాత్రమే ఉన్నట్లున్నాయి. అందుకే అవి కావాలనుకున్నవాళ్ళకు ఇన్ని తిప్పలు.)
ఈరోజు ఈనాడులో వచ్చిన వార్త:
సీడీల్లో 'చందమామ'
ముందుకొచ్చిన తితిదే
ఇప్పటికే లక్ష పేజీల నిక్షిప్తం (60 యేళ్ల కాలంలో వచ్చిన తెలుగు చందమామలు దాదాపు 45 వేల పేజీలు ఉండవచ్చు)
చెన్నై - న్యూస్‌టుడే
తెలుగు వారి అభిమాన పుస్తకం.. ఆ కథల మాధుర్యానికి మురిసిపోని తెలుగు వారంటూ ఉండరు.. కేవలం ఒక్క తెలుగు వారినే కాకుండా 13 భాషల్లో అందరినీ ఆకట్టుకున్న గొప్ప పత్రిక చందమామ. ఇప్పుడు ఆ పుస్తకాలను డిజిటలైజ్ చేసి కంప్యూటర్లు, సీడీల్లో నిక్షిప్తం చేయడానికి తిరుమల-తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. తిరుపతిలోని ఎస్వీ డిజిటల్ గ్రంథాలయంలో ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. 13 భాషల్లో ఉన్న మూడు లక్షల పుస్తకాలను పూర్తిగా సీడీల్లోకి నిక్షిప్తం చేస్తామని ఆ గ్రంథాలయ డైరక్టర్ భూమన్ చెప్పారు. చెన్నైలో శనివారం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇప్పటికే లక్ష పేజీలను సీడీల్లో నిక్షిప్తం చేశామన్నారు. వీటిని జనవరి 23వ తేదీ తిరుపతిలో ఆవిష్కరించి, చందమామ సంపాదకులు విశ్వనాథరెడ్డికి అందజేస్తామన్నారు. చందమామ పత్రికలో వచ్చే కథలు ఎంతో విలువైనవని చెప్పారు. ఈ కథల కోసం అంతర్జాతీయంగా ఎన్నో ప్రముఖ ఛానెళ్లు డిమాండ్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇందులో హనుమాన్ కథను సీడీల్లో నిక్షిప్తం చేయడానికి అనుమతిస్తే రూ. ఏడు కోట్లు చెల్లిస్తామని డిస్నీ ఛానెల్ చందమామ యాజమాన్యాన్ని కోరిందని.. వారు అందుకు తిరస్కరించి తమ విశిష్టతను చాటారని తెలిపారు.
దేశమంతా పిల్లలు, పెద్దలు సంబంధం లేకుండా సంతోషించే పని ఇది. శభాష్ టి.టి.డి.
ReplyDeletecamdamaamaku anta gurtimpu ivvadam viznaana ghani gaa gurtimcadam caalaa anamdakaramaina vishayam.
ReplyDeleteదిస్నీ వారి కోర్కెను ఎందుకు తిరస్కరించాలో నాకు అర్థం కావడం లేదు! మన మామ అందరికీ మామవుతాడంటే మనకు పోయేదేంటి? ఇక్కడ అమెరికాలో ఈ పిల్లల ప్రోగ్రాములు చూడలేక చస్తున్నాం, డిస్నీ చేతిలో పడితే ప్రపంచ ప్రాముఖ్యం రాదా చందమామకి?
ReplyDelete--ప్రసాద్
http://blog.charasala.com
ఉత్తరభారతీయులెవరో వేసిన పుస్తకమొకటి చూశాను నేనొకసారి - హైదరాబాదులోని పుస్తకాల షాపుల్లోనే. పుస్తకం పేరు "టేల్స్ ఆఫ్ తెనాలి రామన్"! తెలుగువాడైన తెనాలి రామలింగడికి అరవపేరు పెట్టేసి కథలు రాసేసి, తెలుగువాళ్ళకే ఆ పుస్తకాలు అమ్మజూశారు వాళ్ళు (ఉత్తరభారతీయులు కానివాళ్ళంతా అరవ్వాళ్ళేననే భ్రమతో కావచ్చు లేదా తమిళపేరు పెడితే తమిళులు కూడా ఆసక్తిగా కొంటారనే ఉద్దేశ్యంతో కావచ్చు). రేప్పొద్దున హనుమంతుడు, భారతీయ సంస్కృతికి ప్రతీకలైన చందమామ కథల్లోని ఇతర పాత్రలు వేష భాషల్లో, ప్రవర్తనలో అమెరికనైజ్ ఐపోయి, అవి చందమామ కథలుగా ప్రపంచమంతటా ప్రచారం పొందుతూ, భారతీయత అంటే ఇదే అనే భావన కలిగిస్తూ ఉంటే అది సరైనదేనంటారా? పైగా తన కథలన్నిటినీ తానే బుల్లితెర మీదికెక్కించడానికి చందమామ సన్నాహాలు చేస్తోందనుకుంటా. అందుకే ఇచ్చి ఉండరు.
ReplyDeleteఇక్కడో మాట: భారతీయత పేరిట స్పైడర్మాన్ కు పంచెకట్టి చూపించారు ఇటీవల. అది అనవసర ప్రయోగమే కదా? పంచెకట్టు, చీరెకట్టు మనకెంత ఇష్టమైనా గోడలు పట్టుకుని పాకేవాళ్ళకు ఎంత అసౌకర్యాన్ని కలిగిస్తాయో కూడా ఆలోచించరా? ఒకచోట పుట్టిన కథల్ని ఇంకొకరు చెప్తే ఇలానే ఏడుస్తాయి.