Sunday 28 January, 2007

సినిమా పండుగ రెండోరోజు విశేషాలు


మార్కస్ బార్ట్లే వాడిన మిచెల్ కెమెరా


పాతపాత్రల్లో కొత్తనటులు

దుర్యోధనుడిగా బాలకృష్ణ
ఆహార్యం: అదిరింది.
ఆంగికం: ఫర్వాలేదు.
వాచికం: అధ్వాన్నం.

శకుని పాత్రకు ఏవీఎస్ అతికినట్లు సరిపోయాడు.

ఉత్తరకుమారుడిగా బ్రహ్మానందం: బ్రహ్మానందం పర్ఫార్మెన్స్ ఇంత పేలవంగా ఉండగలదని ఊహించనేలేదు. రేలంగిలో శతాంశమైనా లేదు.
***

స్టేజి క్రింద అలనాటి సదాజపుడు పద్మనాభం ఈ వయసులో కూడా ఎక్కడా తడుముకోకుండా, తడబడకుండా "ప్రేమకోసమై..." పాటను పూర్తిగా ఆలపించి ప్రేక్షకులను ముగ్ధులను చేశారు.

ప్రదర్శనలో ఎన్టీయార్ వాడిన గదలు, కిరీటాలు వగైరాలతోబాటు మార్కస్ బార్ట్లే వాడిన కెమెరాను కూడా ప్రదర్శించడం విశేషం.


ఇక వినోద కార్యక్రమాల్లో వార్తలకు సునీల్ చేసిన అభినయం హైలైట్. అది చూసి నవ్వలేక చచ్చాం.

4 comments:

  1. neanu 2 rojulu gaa tv ki atukkupoyi custunnanu.naaku ii vedukalu caalaa nachchaayi.

    ReplyDelete
  2. శివారెడ్డి మిమిక్రీ కూడా అదిరింది. మూడవ రోజే మిస్సైల్లు, శతఘ్నులు పేలుతున్నాయి. వర్గ పోరులు బయట పడ్డాయి.

    ReplyDelete
  3. ఆంగికానికి ఆహార్యానికి తేడా ఏమిటండి?

    ReplyDelete
  4. ఆంగికం అంటే body movements, ఆహార్యమంటే గెటప్ అనే అర్థంలో వాడానండీ!

    ReplyDelete