Monday, 8 September 2008

బేడర కన్నప్ప - భక్త కన్నప్ప

శివుడు కలలోకొచ్చి తన కళ్లను సమర్పించమని కోరాడని చెప్తూ తన రెండు కళ్లనూ (ఒక్కో కన్నునొక్కోసారి) పెరికేసుకుని శివుడికి సమర్పించి ఇటీవల వార్తల్లోకెక్కాడొక కన్నడిగుడు. అతడి పేరు ముదుకప్ప ఎల్లప్ప కరాడి. అతడికి తిరిగి చూపొచ్చే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. బాగల్కోట్ ప్రాంతానికి చెందిన ఈయన ప్రస్తుతం బెంగుళూరులోని NIMHANS (National Institute of Mental Health And Neuro Sciences)లో మానసిక చికిత్స పొందుతున్నాడు. ఈ విపరీత ప్రవర్తనకు మూలం భక్త కన్నప్ప కథే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐతే శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో శివుడికి తన కళ్ళు పెకలించి సమర్పించిన భక్త కన్నప్ప ఎక్కడి వాడు? ఈయన కడప జిల్లాలోని రాజంపేట మండలం ఊటుకూరులో జన్మించాడని ఎస్‌.కె. పళణిస్వామి అనే పరిశోధకుడు అంటున్నారు. వివరాలు నిన్నటి ఈనాడు కడప జిల్లా వార్తల్లో ఇలా ఉన్నాయి:
భక్తకన్నప్ప చరిత్ర రికార్డుల అప్పగింత
రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే : శ్రీకాళహస్తీశ్వరస్వామి పరమభక్తుడు భక్తకన్నప్ప(తిన్నడు) కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులో జన్మించినట్లు తెలిపే చరిత్ర రికార్డులను, ఆధారాలను శనివారం ఊటుకూరు గ్రామ సర్పంచి ఎం.ఎల్‌.నారాయణ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు కాళహస్తీశ్వర దేవస్థానం డిప్యూటీ ఈవోకి అందజేశారు. భక్తకన్నప్ప చరిత్రపై సర్వే నిర్వహించిన ఎస్‌.కె. పళణిస్వామి ఈ సందర్భంగా భక్తకన్నప్ప ఊటుకూరులో జన్మించినట్లు ఆధారాలను కాళహస్తీ అధికారులకు చూపించి విఫులంగా వివరించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్‌.వి. వెంకట్రాజు మాట్లాడుతూ ఆధారాలను పరిశీలించి జన్మస్థలిగా గుర్తింపు కోసం ఈ ఆధారాలను ఉన్నతాధికారులకు పంపుతామని పేర్కొన్నారు.

3 comments:

  1. తిన్నడంటే కన్నప్పేనని నాకిన్నాళ్లూ తెలీదు. థాంక్యూ త్రివిక్రమ్.

    ReplyDelete
  2. Hi Trivikram,

    Discovered your blog today.
    మన కడప గురించి ఇంత బాగా, ఇంత ఆప్యాయతతో రాయడం చూచి చాలా ఆనందం కలుగుతోంది.కడపలో మీరెక్కడినుంచి?
    Thanks,
    Kumar

    ReplyDelete
  3. @ రానారె,

    కన్నిచ్చి తిన్నడు కన్నప్పయ్యాడు. :)

    @ నరసింహ కుమార్,

    రాయవలసింది ఇంకా చాలా ఉంది. త్వరలో రాస్తాను. మీ ప్రోత్సాహానికి నెనర్లు. మాది కడప నుంచి 7 కి.మీ. దూరంలో ఉండే ఒక చిన్న పల్లెటూరు. రాయచోటి రోడ్డులో NH 18 నుంచి లోపలికి ఒక కి.మీ. ఉంటుంది. ఊరి పేరు పడిగెలపల్లి.

    ReplyDelete