Saturday, 19 April 2008

చందమామ కాఫీటేబుల్ బుక్ లేక 60th Year Anniversary Book లేక...

...చందమామ కలెక్టర్స్ ఎడిషన్. చందమామ పత్రిక ప్రచురణ ప్రారంభమై అరవయ్యేళ్ళు పూర్తైన సందర్భంగా చందమామ పాత సంచికల్లోని కథలను పుస్తకాలుగా ప్రచురిస్తామని ప్రచురణకర్తలు ప్రకటించి ఉన్నారు. ఆ పుస్తకాల్లో మొదటిది సిద్ధమైంది. అదే చందమామ కాఫీటేబుల్ బుక్ లేక 60th Year Anniversary Book లేక... ...చందమామ కలెక్టర్స్ ఎడిషన్. ఆ పుస్తకాన్ని అమితాబ్ బచ్చన్ మొన్న ముంబాయిలో ఆవిష్కరించారు. అది నిన్నటి నుంచే మార్కెట్లో లభ్యమౌతోందని ప్రకటించారు. వెల 449 రూపాయలు. చందమామ వెబ్సైటు నుంచి ఇప్పుడే ఆర్డరు చేస్తే 20% డిస్కౌంటు కూడా ఉంది. ఆవిష్కరణోత్సవ విశేషాలు కూడా అక్కడే చదవొచ్చు.

PS: రానారే! ఇప్పుడు నా తల 'సేఫే'నా? ;)

5 comments:

  1. ఇది తెలుగులోనా ఆంగ్లంలోనా?

    ReplyDelete
  2. @రానారె: ఐతే ఇక బేతాళుడు చెట్టెక్కడం మాని బుక్కు చదవడం మొదలుపెడతాడన్నమాట. ;)

    @leo: ఆంగ్లంలోనేనండీ.

    ReplyDelete
  3. ఆంగ్లంలోనా! ఐతే భేతాళుడు చెట్టెక్కాల్సిందే. ఎక్కి, చందమామవారి గూటిలో పీడీయఫ్ ఆర్కైవులు చదువుకోవచ్చు.

    ReplyDelete
  4. పుస్తకం తెచ్చుకున్నాను. బాగా నిరాశపరచింది.

    ReplyDelete