నేను టీవీ పెద్దగా చూడను. ఐనా టీవీలో ఇటీవలి కాలంలో నేను చూసిన వాణిజ్య ప్రకటనల్లో నాకు నచ్చినవి, నచ్చనివి కొన్ని:
(వాణిజ్య ప్రకటనల గురించి సంభవామి బ్లాగులో రాసింది చదివాక)
చిన్నపిల్లలతో తీసిన ప్రకటనలన్నీ నాకు బాగా నచ్చుతాయి. మచ్చుకు కొన్ని -
సర్ఫ్ ఎక్సెల్ ప్రకటనలు:
మరక మంచిదేగా! - (శక్తి కొద్దీ బురదతో పోట్లాడి, విజయోత్సాహంతో "సారీ చెప్తున్నాడు" అని చెప్పేదొకటి, షూ లేసులతో కుస్తీపట్టి దుమ్ములో మునిగితేలేదొకటి),
కోల్గేట్ వారి చిన్నపిల్లల ప్రకటన :
"మ్...దంతక్షయం!"
":( అక్కా?"
"నేను డెంటిస్ట్ ని"
..."దంతక్షయం కావడం కష్టం డాక్టర్!",
అలాగే హగ్గీస్ "వాటర్ ఫాల్" ప్రకటన...ఎంత అందంగా ఉంటుందో కదా?
కొంతకాలం కిందట వచ్చిన రిలయన్సు వారి ఇన్సూరెన్సుకు సంబంధించిన ప్రశ్నల ప్రకటన:
"నువ్వు చాక్లెట్లు ఎందుకు తింటావు?"
"నీకు కూడా గడ్డం వచ్చేస్తేనో??".
(ఇది చూసినంతసేపూ ముద్దొస్తుంది గానీ చివర్లో చిన్నపిల్లలడిగేవి అర్థం లేని ప్రశ్నలనడమే బాలేదు.)
ఇలాంటివే మరికొన్ని ప్రకటనలు...బ్రాండు పేరుతో సంబంధం లేకుండా అన్ని చిన్న పిల్లల వస్తువుల ప్రకటనలు.
ఇక నాకు చూస్తేనే ఒళ్ళుకంపరం కలిగించే ప్రకటనలు:
చిన్నపిల్లాడితో తీసిన గోద్రెజ్ హేర్ డై ప్రకటన - దీంట్లో తండ్రికి తెల్లజుట్టుంటే కొడుకు దాన్ని అవమానంగా భావించడం, దాంతో ఆ తండ్రి తన జుట్టుకు రంగేసుకోక తప్పదని చూపించడం నాకు నచ్చలేదు. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగంటే ఇదేనేమో? ఈ కోవకు చెందిందే ఇంకొకటి:
రంగుల సెల్ ఫోన్ల గురించి వచ్చిన ఒక ప్రకటన - దీంట్లో రంగుల్లేని సెల్ ఫోన్ వాడేవాళ్ళందరూ దాన్నొక అవమానంగా భావించి తమ సెల్ ఫోన్లను ఎవరికంటా పడకుండా దాచేందుకు నానా అవస్థలు పడుతున్నట్లు చూపించారు. ఇప్పటికీ నేను వాడుతున్నది రంగులుగానీ, (కెమెరా, FM రేడియో లాంటి) అదనపు హంగులు గానీ ఏ మాత్రమూ లేని అతి సాధారణమైన సెల్ ఫోన్ మాత్రమేనని బ్లాగుముఖంగా సగర్వంగా ప్రకటిస్తున్నాను.
మింటో-ఫ్రెష్ ప్రకటనలు - ఇవి మరీ దారుణంగా ఉంటాయి. (వీటిలో ఒకటి మాత్రం నాకు నచ్చుతుంది: అదేమిటంటే ఒక నిండు గర్భవతిని పార్కులో ఒక ఉయ్యాల మీద కూర్చోబెట్టి ఆమె భర్త మింటోఫ్రెష్ చప్పరించి నోటితో మెల్లగా గాలి వదలగానే ఆ గాలి తాకిడికే ఉయ్యాల ఊగుతుంది.)
మింటో ప్రకటనే ననుకుంటా - మరోటుంది నాకు నచ్చేది..
ReplyDeleteక్లాసు జరుగుతూ ఉంటుంది, కుర్రాడొకడు ఆలస్యంగా వచ్చి బోర్డు మీద ఏదో రాస్తూ ఉన్న లెక్చరరు కంటపడకుండా, పిల్లిలా లోపలికి వస్తూ ఉండగా, ఆయన చూసి, కోప్పడి బయటికి పొమ్మంటాడు. మరోసారి మళ్ళీ అలాగే ఆలస్యంగా వచ్చి (మింటో తిన్నాక అన్నమాట!), ఈసారి తెలివిగా వెనక్కి నడుచుకుంటూ లోపలికి పిల్లిలా వస్తూ ఉంటాడు. ఈసారీ లెక్చరరు చూస్తాడు. అయితే, వెనక్కి నడుస్తున్నాడు కదా, క్లాసులోంచి మెల్లగా బయటికి జారుకుంటున్నాడని అనుకుని, లోపలికి పొయ్యి కూచ్చోమని గదుముతాడు! నాకు నచ్చిన ప్రకటనల్లో అది ఒకటి. అలాగే నౌకరీ.కామ్ వారి "హరి సాడూ" ప్రకటన!