నిజమే! ప్రసాదం బ్లాగులో చెప్పినట్లు కొంతమంది సర్దార్జీలు తమ మీద తామే జోకులేసుకుని అందరినీ నవ్విస్తూ తామూ వాళ్లతో కలిసి మనసారా నవ్వగలుగుతారు. కానీ దేనికైనా ఒక పరిమితంటూ ఉంటుంది కదా? అందుకే ఇప్పుడు శృతి మించి రాగాన పడిన సర్దార్జీ జోకులను నిషేధించాలంటూ కొందరు సర్దార్జీలు మైనారిటీస్ కమీషన్ ను కోరారు. ఇదే విషయంపై ఒక ప్రజాప్రయోజనవ్యాజ్యం కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది.
Sikhs ask cops to ban 'Sardar' jokes on Net
రాజ్యాంగం లోని ప్రాథమికహక్కుల్లో Protection of life and personal liberty అనేది అతి ముఖ్యమైన హక్కు. Right to live with dignity (గౌరవప్రదంగా జీవించడం) కూడా అందులో భాగమే. ఇది ప్రతివారికీ ఉండే హక్కు. ఇప్పుడు రానురాను మరీ అవమానకరంగా తయారౌతున్న ఈ జోకుల వల్ల తమ గౌరవం, ప్రతిష్ట దెబ్బతింటున్నాయని కొందరు సిక్కుల ఫిర్యాదు.
“I think these jokes can be very demeaning. And the line between what is healthy and what is humiliating has been crossed.” –Jeev Karan, a college student
“Unlimited jokes have an impact on the psyche of the community. Also, if one encounters a police officer who is a Sikh, he won’t be taken seriously. They’ll in stead take him to be a comedian.” –Tejdeep Kaur Meenon
ఇదిలా ఉండగా వాక్‌స్వాతంత్ర్యపు హక్కుకున్న పరిమితులెరుగని పాత్రికేయుడొకడు సర్దార్జీల మీద జోకులెయ్యొద్దనడం తమ వాక్‌స్వాతంత్ర్యపు హక్కును అడ్డుకోవడమేనని హిందూస్థాన్ టైమ్స్ లో రాశాడు. అది రాసినవాణ్ణీ, వేసిన సంపాదకులను, ప్రచురణకర్తను నోటికొచ్చినట్లు తిట్టి, 'ఇది నా వాక్‌స్వాతంత్ర్యపు హక్కు' అంటే ఏమంటారో?
ఇవి కూడా చూడండి:
http://www.dnaindia.com/report.asp?NewsID=1084154
http://o3.indiatimes.com/sardarji
http://www.panthic.org/news/129/ARTICLE/1332/2005-05-15.html
ఇంత చిన్న విశయం తెలియకుండా ఆ పెద్దాయన పాత్రికేయుడెలా అయ్యాడో!
ReplyDeleteజోకులు ఇతరులను పీడించి వేసుకొనేవిగా వుండకూడదు. మన నవ్వు ఇంకొకడికి విషాదమవ్వకూడదు.
మనం ఎవ్వరి మీదయినా జోకు వేసే ముందు ఆ స్థానంలో మనలను వూహించుకొని చూసుకోవాలి ముందు.
గత ఆదివారం జెమినిలో "జాలీవుడ్ ఎక్స్‌ప్రెస్" చూశా! కళ్ళు చిదంబరం కనపడగానే "నువ్వు నన్ను చూస్తున్నావా? ఆమెని చూస్తున్నావా?" -- ఇది జోకు నేను నవ్వాలి. ఇంత తలతిక్క ఎందుకుంటుందో జనాలకు అర్థం కాదు.
ఆ తర్వాత ఇద్దరు బధిరులు కలిస్తే ఎలా సంబాషణ వుంటుందో చూపడం! అదీ జోకే! వైకల్యం వాళ్ళకా వైకల్యం మీద జోకులేసుకొనే మనకా?
ఇంకా హైలెట్టు ఏమిటంటే గుడ్డివాడు ఒంటరిగా వున్నప్పుడు ఏమని ఆలోచిస్తాడు (లేదా ఏదో ఇలాంటిదే) అని చూపించడం జోకు!
గుడ్డివాడి వ్యధా, బాధా ఈ గాదిద కొడుకలకు జోకు! ఇంతకంటే జోకులెయ్యడం రాకుంటే మన తెలుగు బ్లాగరులను చూసి నేర్చుకోరాదూ!
--ప్రసాద్
http://blog.charasala.com