Sunday, 5 November 2006
కార్తీక పున్నమి
ఈ రోజు కార్తీకపున్నమి. మిగతా నెలలకంటే కార్తీకమాసంలో వెన్నెల ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది. ఇక కార్తీకపున్నమికి ఉన్న ప్రత్యేకత విడిగా చెప్పనక్ఖర్లేదు. ఐతే ఈరోజు ఇంకోరకమైన వెన్నెలను తనివితీరా అస్వాదించాం తెలుగువికీపీడియనులందరం. ఈరోజు ఈనాడులో వికీపీడియా గురించి ముఖపత్రకథనం రావడంతో ఒక్కదెబ్బతో తెవికీ గురించి లక్షలాదిమందికి తెలియడమేగాక ఒక్కరోజులోనే వందమందికి పైగా కొత్త వికీపీడియనులు చేరారు. వీళ్ళలో ఎంతమంది స్థిరంగా తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడతారో చూడాలి. నిన్నంటే నిన్న చింతుగారు తన బ్లాగులో తెలుగువికీ వీరవిహారం గురించి రాయడం, కొన్ని గంటల తేడాలో ఈనాడులో ఈ కథనం రావడం ఆశ్చర్యానందాలు కలిగిస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
కొత్త సభ్యులు వికీపీడియాలో కార్తీక దీపాలు వెలిగించినట్లుందన్నమాట!
Post a Comment