ఇటీవల వెలువడిన ఒక సర్వేక్షణలో విస్మయం కలిగించే విషయాలు బయటపడ్డాయి. దీన్ని బట్టి చూస్తే అజ్ఞానంలో ఉండడాన్ని తమ జన్మహక్కుగా భావించే గృహిణులే కాదు ఉద్యోగాలు చేసే మహిళల్లో సైతం చాలా మందికి లైంగికవేధింపుల పట్ల సరైన అవగాహన లేదు. 1997లో విశాక కేసులో సుప్రీమ్‌కోర్టు లైంగిక వేధింపులంటే ఏమిటో కూలంకషంగా వివరించడమేగాక మహిళలు తాము పనిచేసేచోట లైంగిక వేధింపులకు గురికాకుండా చూడవలసిన బాధ్యత వారిచేత పనిచేయించుకుంటున్నవారిదే (employers)నని తేల్చిచెప్పింది.
ఈ నేపథ్యంలో :
అసలు దేన్ని లైంగికవేధింపు అనవచ్చు?
లైంగికవేధింపు మానవహక్కుల ఉల్లంఘనా? కాదా?
లైంగికవేధింపులకు పాల్పడే వాళ్ళకు శిక్ష లేదా?
వాళ్ళమీద ఎవరికి ఫిర్యాదు చెయ్యాలి?
మహిళలు పనిచేసేచోట లైంగికవేధింపులను అరికట్టడానికి ఎలాంటి ఏర్పాట్లుండాలి?
అది ఎవరి బాధ్యత?
లైంగిక వేధింపులు జరిగేచోట పై అధికారుల, సహోద్యోగుల బాధ్యతలేమిటి?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి.
ఏయే చర్యలు లైంగికవేధింపులుగా పరిగణించబడుతాయో ఇక్కడ కూడా చూడవచ్చు.
చాలా బాగుంది. సముద్రానికి అవతలి కథ..ఇటువంటి చట్టాలనడ్డుపెట్టుకొని కొందరు జాణలు కార్యస్థలంలో వగలుపోయి తొటి పనిచేశేవారిని ఉద్రేక పరచడం... ఆ తరువాత ఆ కంపెనీలో వేధింపులకు గురయ్యామని కంపెనీని కోర్టు కీడ్చడం జరుగుతున్నాయి.
ReplyDeleteఇక్కడ ఎంజాయ్ చేసింది ఉద్యోగులు మధ్యలో కంపెనీకి మిలియన్లు బొక్క. అందుకే కంపెనీలు, రెచ్చిపోతారనుకొనే జాణలను ఉద్యోగాలలో తీసుకోకుండా చాలా జాగ్రత్త పడుతున్నాయి ఈ మధ్యలో.