కథంటూ మొదలయ్యాక దిక్కులు చూడ్డం మానేసి సూటిగా లక్ష్యం వైపు పరుగెత్తాలి. నవలారచన విశాలమైన మైదానంలో గుర్రపుస్వారీ లాంటిదైతే కథారచన తాడుమీదనడక లాంటిదంటారు. రచయిత దృష్టి చెప్పదలచుకున్న పాయింటు నుంచి ఏ మాత్రం పక్కకు తప్పినా కథ కుప్పకూలిపోతుంది. అందుకే కథారచయితకు కథ రాసేటప్పుడు తన మీద తనకు గొప్ప అదుపు ఉండాలి. ఈ విషయంలో స్వర్గీయ సొదుం జయరాం చాలా గొప్పవాడని, ఆయన కథల్లో అనవసరమైన సన్నివేశం గానీ, అనవసరమైన వాక్యం గానీ, అనవసరమైన మాటగానీ ఉండవని రచయితలు, విమర్శకులు, సాహితీపత్రికల సంపాదకులు గొప్పగా చెబుతారు. ఆయన రాసిన కథలు చాలా మటుకు రెండుపేజీల్లోపలే ముగుస్తాయి. అయితేనేం? అవి నిస్సందేహంగా చాలాగొప్ప కథలు. కొడవటిగంటి కుటుంబరావు ప్రశంసలు పొందిన కథకుడాయన. రెండేళ్ళ కిందట ఆయన కథలకు రాచకొండ రచనాపురస్కారం వచ్చింది. (సొదుం జయరాం కథలు: ప్రచురణ బండ్ల పబ్లికేషన్స్, విజేత కాంపిటీషన్స్ జనరల్ బుక్స్ సీరీస్).
కేతు విశ్వనాథరెడ్డి ముప్ఫయ్యేళ్ళ కిందట కడప నుంచి వెలువడిన లిఖిత మాసపత్రిక మనోరంజనిలో (సాహిత్యనేత్రం సంపాదకుడు శశిశ్రీ ఈ పత్రికను నడిపారు) "మారుచీరె" అనే కార్డుకథ రాశారు. అది తెలుగుపీపుల్ లోని దాట్ల గారి కథ కంటే చిన్నది. ఐనా ఆ కథ గొప్పదనానికొచ్చిన లోటేమీ లేదు. పాత్రల పేర్లు నాకు గుర్తుండవు. ఈ కథలోని పాత్రల పేర్లు అచ్చమ్మ, బుచ్చమ్మ అనుకుందాం.
ఒకే కాలేజీలో చదివే అచ్చమ్మ ధనవంతుల పిల్ల, బుచ్చమ్మ పేదరాలు. కాలేజీ వార్షికోత్సవమప్పుడు వేసిన నాటికలో అచ్చమ్మ పేదరాలి వేషం, బుచ్చమ్మ ఒక మగవాడి వేషం వేశారు (పేద హీరోయిన్, ధనిక హీరో వేషాలనుకుంటా). స్టేజీ మీద కట్టుకోవడానికి అచ్చమ్మ దగ్గర పాతచీరె లేదు. బుచ్చమ్మ ఎలాగూ మగవాడి వేషం వేస్తోంది కాబట్టి ఆమె చీరె అచ్చమ్మ తీసుకుంది. నాటిక పూర్తయ్యాక బుచ్చమ్మ తన చీరివ్వమని అచ్చమ్మను అడిగింది. దానికి అచ్చమ్మ "ఆ చీరె మళ్ళీ కట్టుకుంటావటే? సహజత్వం కోసం దానికున్న చిరుగులను పెద్దవి చేశానే." అంది. సమాధానంగా "నాకున్న మారుచీరె అదొక్కటేనే." అంటున్న బుచ్చమ్మ గొంతు వణికింది.కథంతా ఇంతే.
ఇటీవలి సంవత్సరాల్లో రచనలో ఛాయామల్లిక్ మైక్రోకథలు కొన్ని రాశారు. వాటిలో ఒకటి చాక్లెట్-రేపర్: పెళ్ళైన కొత్తలో ఒకనాటి రాత్రి భర్త తన పట్టుచీరను లుంగలు చుట్టిపారేస్తూంటే భార్య "అయ్యో!" అని బాధపడుతుంది. దానికి భర్త "నాకు రేపర్ కంటే చాక్లెట్టే ముఖ్యం." అంటాడు. ముప్ఫయ్యేళ్ళ తర్వాత: భార్య "మీ చాక్లెట్ పాడైపోయిందండీ" అని బాధపడుతుంది. దానికి భర్త "ఇంతకాలం నేను చాక్లెట్ అనుకొన్నదీ రేపరేనని ఇప్పుడు తెలుసుకున్నాను. అసలైన చాక్లెట్ నీ వ్యక్తిత్వమే." అంటాడు.
కొడవటిగంటి కుటుంబరావు రాసిన అనేక గల్పికలు - గొప్ప ఎడ్యుకేటివ్ వాల్యూస్ ఉన్నవి - సగం పేజీలోనే ముగుస్తాయి. చందమామలో సింగిల్ పేజీ కథలు ప్రత్యేక ఆకర్షణ. కాదంటారా?
నవీన్ గారు,
ReplyDeleteమీ రాత ద్వారా నాకు రచన.నెట్ ని పరిచయం చేసారు. మంచిది.
చిన్న కధ నిడివి గురించి మీరు రాసినది బావుంది.
నా రెండు అణాలు ఇవిగో..
పది పేజీలు 'సాగే' ఒక చిన్న ఆలోచనా, అర పేజీలో ఆగిపోయే ఒక పెద్ద ఆలోచన, వీటిలో ఏది చిన్న కధ?
దీనికి నా సమాధానం, కేవలం ఒక ఆలోచనే ఉంటే అది అసలు కధ కాదేమో. అయినప్పటికి నేను రెండవదానికే ఎక్కువ మార్కులు ఇస్తాను.
శ్రీ రాసినది నాకు కధ కన్నా ఒక కవితలాగ అనిపించింది.
అయ్య బాబోయ్ నేను రాసిన దాని గురించేనా చర్చించుకుంటున్నారు :-). ధన్యవాదములు త్రివిక్రం గారు. నిజమేనండీ గిరి గారు నా కధ కాస్త కవితాత్మకంగా వుంది. ఒప్పుకుంటాను. అసలు విషయం ఏంటంటే నేను వాళ్ళకి రెండు కధలు (సారీ :) మీ దృష్టిలో ఒకటి కవిత) పంపించాను. నిజ సౌందర్యం మరియు రాతి హృదయం. కానీ వాళ్ళకి నిజ సౌందర్యం ఒకటే చిన్న కధలా అనిపించిందనుకుంట. దానిని ప్రచురించారు. మరి వాళ్ళ దృష్టిలో రాతి హృదయం కధ కానట్టులా ఉంది. నా దృష్టిలో మాత్రం రాతి హృదయం నూటికి నూరు పాళ్ళు చిన్న కధే. మరి దానిని ఎందుకు తిరస్కరించారబ్బా? వేచి చూద్దాం.
ReplyDeleteమీ దృష్టి కథలపై కూడా ఉందా? మీ బ్లాగులలో స్పృశించని అంశమేదో తెలుసుకోవటం కష్టం.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteరావు గారూ, మీరు నా గురించేనా మాట్లాడుతున్నారు. నా హరివిల్లులో రంగులు సప్త వర్ణములు కాదండోయ్! వాటి కన్నా ఎక్కువే. సుషుప్తమైన వర్ణములు చాలా ఉన్నాయ్ . వాటిని తట్టి లేపాలి మరి.
ReplyDelete:-) చదువుతూనే ఉండండి.