Friday, 19 May 2006

నిలిచే నవలలు ఏవి?

"నిలిచే నవలలు ఏవి? (ప్రముఖుల ప్రత్యేక నవలా విశ్లేషణలు)" అనే పేరుతో 2001లో ఒక పుస్తకం వచ్చింది:
సంపాదకుడు: జయంతి పాపారావు

అందులో కాలపరీక్షను తట్టుకుని "నిలిచే నవలలు" గా తాము భావించిన 20 నవలల గురించి 20 మంది ప్రముఖ సాహితీవేత్తల వివరణాత్మక విశ్లేషణలున్నాయి.

ఆ ఇరవై నవలలు - నవలా రచయితలు (బొద్దుగా ఉన్నవి నేను చదివిన నవలలు):

శ్రీ రంగరాయ చరిత్ర (నరహరి గోపాల కృష్ణమ చెట్టి)
మాలపల్లి (ఉన్నవ లక్ష్మినారాయణ)
మంచీ-చెడూ (శారద)
కాలాతీత వ్యక్తులు (పి.శ్రీదేవి)
మరల సేద్యానికి (శివరామ కారంత్)

బ్రతుకు భయం (ఇది బెదిరిన మనుషులు నవలకు సీక్వెల్) (కొడవటిగంటి కుటుంబరావు)
అంపశయ్య (నవీన్)
స్వీట్ హోం (రంగనాయకమ్మ)
దారిపొడుగునా (చెరబండ రాజు)
మా పల్లె (చెరబండ రాజు)

వేలాడిన మందారం (జ్వాలాముఖి)
మూడు కథల బంగారం (రావి శాస్త్రి)
మూడు కథల బంగారం - విమల (రావి శాస్త్రి)
వసంత మేఘం (పులి ఆనంద మోహన్)
ఇల్లు (రావి శాస్త్రి)

రేగడివిత్తులు (చంద్రలత)
మీ రాజ్యం మీరేలండి (స్వామి)
పంచమం (చిలుకూరి దేవపుత్ర)
కాడి (సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి)
అంటరాని వసంతం (జి. కళ్యాణ రావు)


ఇందులో లేని గొప్ప నవలలు కొన్ని (నేను చదివినవి):

చదువు
( రచయిత కొడవటిగంటి కుటుంబరావు వ్రాసిన చదువు, జీవితం, అరుణోదయం, గడ్డురోజులు లాంటి నవలల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషణ ఎక్కువగా ఉండగా, బెదిరిన మనుషులు , బ్రతుకు భయం లలో మనోవిశ్లేషణ ఎక్కువగా ఉంది.) ఇక మనోవిశ్లేషణ నవలలుగా జగత్ప్రసిద్ధి పొందిన నవలలు:

అసమర్థుని జీవయాత్ర,
చివరకు మిగిలేది,
అల్పజీవి.

ఇంకొన్ని నవలలు:

అనుక్షణికం
కొల్లాయి గట్టితేనేమి?
పుణ్యభూమీ కళ్ళుతెరు!
మైదానం
స్వేచ్ఛ


ఈ మధ్య చదివిన మంచి నవల: ఈ తరం స్త్రీ (విద్యావంతులైన మధ్య తరగతి స్త్రీల - గృహిణులు, ఉద్యోగినుల - సమస్యలను చర్చించిన నవల)

4 comments:

  1. "తోలుబొమ్మలాట" నవల ఆటా తొమ్మిదవ మహాసభల ప్రత్యేక సంచిక కబురు లో భాగంగా ఈమాట వెబ్ పత్రికలో ప్రచురించబడింది.
    http://eemaata.com/em/library/ata-2006/

    ReplyDelete
  2. కాడి, పంచమం, ఈ రెండు నవలలు ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వారి నవలల పోటీలో రెండవ, మూడవ బహుమతులు పొందాయి. (1998 లో అనుకుంటా). అదే పోటీల్లో జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి రాసిన "వలస దేవర" నవల మొదటి బహుమతి పొందింది. నా దృష్టిలో "వలస దేవర" పై రెండింటికన్న ఉత్తమమైనది. ఈ నవలలో, రాయలసీమలో, ఒక చిన్న ఊరిలో, స్వాతంత్ర్యానంతరం యాభై ఏళ్లలో పల్లెలలోకి చొచ్చుకొచ్చిన నాగరికత ప్రజల సామాజిక, ఆర్థిక, కుటుంబ పరిస్థితుల్లో కలిగించిన మార్పులు చాలా సవివరంగా, ఆర్ద్రంగా చిత్రించబడ్డాయి. వలస దేవర కథాంశం విస్తృతిలోనూ, పాత్రచిత్రణలోనూ విశ్వనాథ వారి వేయిపడగలకేమీ తీసిపోదు.(అంతకన్నా రెండింటికీ ఏమీ పోలిక లేదు) నన్ను మటుకు "వలస దేవర" "రేగడి విత్తులు" కన్నా ఎక్కువగా కదిలించింది. రేగడి విత్తులు నవల, బహుమతికి అర్హమైనది కాదనను కానీ, చాలా సంచలనం సృష్టించినందువల్ల కాబోలు, ఎక్కువ మంది దృష్టికి వచ్చింది. "వలస దేవర" ఎక్కువమంది దృష్టికి రాకపోవడం విచారకరం.

    ReplyDelete
  3. ఇక్కడ పొందు పరచినందుకు కృతజ్ఞతలు

    ReplyDelete
  4. anonymous గారికి, పద్మ గారికి, రాకేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

    ReplyDelete