-త్రివిక్రమ్
"ఇది నా అనుభవం. ఇది తెలుగు అసలే రాని తెలుగువారి కోసం కాదు. తెలుగులో ఇంగ్లీషు కలిపి భాషను చంపి పాతరేసే
వారి కోసం. మీరు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడేవారైతే దీన్నిక్కడ పోస్టు చేసినందుకు మన్నించండి.
నామటుకు నేను ఇంగ్లీషులో మాట్లాడ్డం గొప్పగానే భావించేవాడిని. తెలుగు సంభాషణల్లో ఇంగ్లీషు మాటలు కలిపి కొట్టడం నాగరికత
అనుకునేవాడిని. తరువాత్తరువాత తెలిసింది..అదెంత తెలివితక్కువతనమో. పట్టుబట్టి తెలుగులోనే మాట్లాడాలని, ఇంగ్లీషు మాటల్ని కలేసి, చిత్తడి చిత్తడి చెయ్యకుండా తేటతెలుగులో మాట్లాడాలని ప్రయత్నం మొదలుపెట్టాను. చక్కటి తెలుగు మాటలున్న చోట ఇంగ్లీషు మాటల్ని వాడరాదని నిశ్చయించుకున్నాను.
ఇప్పుడు నా పరిస్థితి బాగా బాగుపడింది. చక్కటి తెలుగు కాకున్నా, వినవీలైన తెలుగు మాట్లాడుతున్నాను. మన భాష అనే స్పృహ ఉన్నవారందరికీ అలాగే మాట్లాడాలనే ఉంటుందని నాకు తెలుసు. ప్రయత్నలోపమో, అవతలి వాళ్ళేమనుకుంటారనో చొరవ చెయ్యరు. ప్రయత్నం చేస్తే మనమిది సాధించడం గొప్పేమీ కాదు. నేనిలా మొదలెట్టాను...
1. అంకెలను తెలుగులోనే పలకాలి, ఇంగ్లీషులో మాట్లాడే ప్రశ్నే లేదు.
2. వారాల పేర్లు కూడా తెలుగు లోనే పలకాలి.
3. క్రియల్ని తెలుగులోనే పలకాలి. రన్ చేస్తున్నాను, మీటవుతాను..ఇలాంటివి మానెయ్యాలి. (మీరు గమనించారో లేదో, పై మూడూ
పాటిస్తే మన సంభాషణ సగం తేట పడుతుంది)
4. వాక్యం పూర్తిగా ఇంగ్లీషులో మాట్లాడితే సరే, లేదంటే మాత్రం ఇంగ్లీషు వాడరాదు.
5. అన్నిటికంటే ముఖ్యం - తెలుగును నిలిపేది - ఒకటుంది..మన పిల్లలను తెలుగు పిల్లలుగా పెంచుదాం. వాళ్ళతో తెలుగులోనే మాట్లాడుదాం. వాళ్ళచేత తెలుగు చదివిద్దాం. ఆ వీలు లేకపోతే.. రోజుకో తెలుగు పదమో, పద్యమో, నుడికారమో, సామెతో, జాతీయమో నేర్పుదాం. మాట్లాడితే తెలుగు, లేదంటే ఇంగ్లీషు.. అంతే కాని అదీ, ఇదీ కలిపి కొట్టడం నేర్పవద్దు.
అదే మన భాషకు శ్రీరామరక్ష.
- చదువరి (శిరీష్ తుమ్మల)"
ఒక జాతి సంస్కృతికి భాషే మూలము, కేంద్రమూ, కేంద్రకమూను. సంస్కృతిని కాపాడటం ప్రభుత్వ విధి, బాధ్యత. అన్నిటికీ మించి..ధర్మం. భాషపై ప్రభుత్వానికి, (అందునా భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని సాధించుకున్నాం మనం!) ప్రేమ, గౌరవం, భక్తి, ఆరాధన ఉండాలి. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ధర్మాన్ని పక్కనబెట్టి, స్వయంగా తనే తెలుగును మూలకునెట్టి, ఇంగ్లీషుకు పీట వేస్తోంది. పైగా ప్రాచీనత గురించి కేంద్రంతో మాట్లాడతానని పోసుకోలు కబుర్లు చెబుతోంది.
ReplyDelete"ఏమిటి రాజశేఖర్! మీ రాష్ట్రంలో బడుల్లో తెలుగు తీసేసి ఇంగ్లీషులో చదువులు చెబుతున్నావట గదా! మరి..'నా తెలుగు, దాని ప్రాచీనత' అంటూ నాకీ వినతులేమిటీ?" అని ప్రధానమంత్రి అడిగితే తలెక్కడ పెట్టుకుంటారో..?
పది మంది అత్యంత ప్రముఖ తెలుగు వారిని ఎన్నుకోవాల్సి వస్తే నూటికి తొంభై తొమ్మిది మంది తెలుగువారు కృష్ణ దేవ రాయలును ఖచ్చితంగా ఎంపిక చేస్తారు, రాయలు పదహారణాల తెలుగువాడు కాకున్నా. రాయల దిగ్విజయాలూ, సమర్థ పాలన, పరమత సహనం, రాజకీయ మేథ ఇవన్నీ చరిత్రలో గొప్పవాడిగా నిలబెట్టాయేమో గానీ, ఈనాటికీ తెలుగువారి గుండెల్లో నిలబెట్టింది మాత్రం భాషకు రాయలు చేసిన సేవే!
ప్రస్తుత రాజకీయ నాయకులకు రాజకీయావసరాలే ప్రాణావసరాలు. ప్రజావసరాలు అనవసరాలు. వారినుండి రాయల పాటి సేవను ఆశించడం అత్యాశేనేమో!
మీరు చెప్పినవి అక్షరసత్యాలండీ. మన వాళ్ళ గొడవ "మా తెలుగు తల్లికి మేం గొంతెండ గడతాం. మీరు గొంతు తడపండి." అంటున్నట్లు వినిపించడం లేదూ? రాష్ట్రస్థాయి లో గతంలో ఇస్తూ ఉండిన సాహిత్య అకాడెమీ బహుమతులను కూడా రద్దు చేసేశారు కదా? రాయల వారి సేవలో శతాంశమైనా అత్యాశే! ఆయన కీర్తిలో అణుమాత్రమైనా వీరికి దక్కుతుందా అనేది చరిత్ర తేల్చాల్సిన సత్యం.
ReplyDeleteI don't know how I landed here at this blogspot, but this post is really interesting. Hats off to you guys for initiating this.
ReplyDeleteThyaga
You are more than welcome here. Your compliments should go to chaduvari garu. Keep visiting.
ReplyDelete